Viral | ఇదేంటిది..? బస్సులా ఉంది.. పట్టాలపై పోతోంది?

Viral | ప్రపంచంలోనే మొట్టమొదటి సారి రైల్వే ట్రాక్ పై నడిచే బస్సును జపాన్ తయారుచేసింది. ప్రజా రవాణా కోసం దీనిని ఉపయోగించబోతున్నట్లు

Spread the love
Viral

Viral | ప్రపంచంలోనే మొట్టమొదటి సారి రైల్వే ట్రాక్ పై నడిచే బస్సును జపాన్ తయారుచేసింది. ప్రజా రవాణా కోసం దీనిని ఉపయోగించబోతున్నట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది.

మినీ బస్ మాదిరిగా ఉన్న ఆ వాహనం అటు రైల్వే ట్రాక్ పైనే కాకుండా రోడ్లపై కూడా నడిచేలా డిజైన్ చేశారు. ఇందులో ఒకసారికి 21 మంది ప్రయాణించగలరు. ఇది ట్రాక్ పై 60 కిలోమీటర్ల వేగంతో, రోడ్లపై 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు.

ఈ వాహనం రోడ్లపై వెళ్ళేటప్పుడు సాధారణ బస్సుల లానే 4 టైర్లతో ప్రయాణిస్తుంది. అయితే ట్రాక్ పైకి ఎక్కగానే ముందు, వెనుక 4 ట్రైన్ ఐరన్ వీల్స్ బయటికి వస్తాయి.

అవి రబ్బర్ టైర్లను పైకి ఎత్తేస్తాయి. దీనివల్ల అవి ట్రాక్ కి తగలవు. ఆ సమయంలో ఐరన్ వీల్స్ ఎంచక్కా రైలు మాదిరి బస్సును ముందుకు తీసుకెళతాయి.

#DMV #BUS #TRAIN #JAPAN

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *