
.

శక్తులు ఉన్నాయా లేదా అన్న ప్రశ్నకి సమాధానం ఇప్పటి వరకు దొరకలేదు. దీనిపై ఇప్పటికీ చర్చలు జరుగుతూనే ఉంటాయి. వీటికి కొందరు నమ్మితే, మరికొందరు బూటకం అని కొట్టిపారేస్తుంటారు. కానీ వీటికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేయడం అంటే వింతగా అనిపిస్తుంది. అయితే ఇటువంటి సంఘటనే మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
తన వస్తువులను ఏదో అదృశ్య శక్తి కాజేస్తోందని, తన తిండి కూడా అదే శక్తి తినేస్తోందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా తన నగల బరువును కూడా అదృశ్య శక్తి తగ్గించేస్తోందని ఆమె చెప్పుకొచ్చింది. ఈ ఫిర్యాదు తీసుకున్న పోలీసులు ఖంగుతిన్నారు. తీరా కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసును సాల్వ్ కూడా చేశారు.
కేసు దర్యాప్తు చేసిన పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ రత్నాకర్ హింగ్వే తెలిపిన వివరాల ప్రకారం.. ఫిర్యాదు చేసిన మహిళ మానసిక సమస్యలతో బాధపడుతుందని, ప్రస్తుతం ఆమెను కౌన్సిలింగ్‌కి పంపాము. ఓ మానసిక వైద్య నిపుణుడి వద్దకు పంపుతున్నామని ఆయన తెలిపారు. అంతేకానీ ఆమె చెబుతున్న అదృశ్య శక్తి ఏమీ లేదని, ఆమె వస్తువులు, దుస్తులు అన్నీ కూడా ఎక్కడివక్కడే ఉన్నాయని వారు చెప్పుకొచ్చారు.
r