
Wedding

Wedding | ఈ మధ్య కాలంలో పెళ్లిళ్లు చేసుకునే జంటలు కుదరినంత వెరైటీగా, రొమాంటిక్‌గా, థ్రిల్లింగ్‌గా పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నాయి. చాలామంది తమ పెళ్లిని అందరికీ గుర్తుండిపోయేలా చేసుకోవాలనుకుంటున్నారు.దానికోసం స్టంట్లు చేయడానికి కూడా రెడీ అయిపోతున్నారు.
ఇదిగో ఈ వీడియోలో జంట కూడా అలానే చేసింది. కానీ అనుకోకుండా జరిగిన పొరపాటుతో అంతెత్తునుంచి కింద పడిపోయింది. మీరూ ఓ సారి చూసేయండి.
పెళ్లంటే జీవితంలో ఒకేసారి చేసుకుంటాం. మరి అలాంటి పెళ్లిని అందరిలా చేసుకుంటే మజా ఏముంటుంది. ఇదే ఆలోచనతో ఎన్నో జంటలు వెరైటీగా పెళ్లి చేసేకోవాలని అనుకుంటున్నాయి. వారిలో కొంతమంది కొండలెక్కి పెళ్లి చేసుకుంటే.. ఇంకొంతమంది ఆకాశంలో ఒక్కటవుతున్నారు.
మరికొందరు భూమ్మీదే వెరైటీ వెడ్డింగ్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ వీడియోలో జంట కూడా అలానే ప్లాన్ చేశారు. తమ పెళ్లికి ఓ జేసీబీని మాట్లాడుకున్నారు. పెళ్లికి వచ్చిన అతిథులంతా కూర్చుని ఉండగా.. జేసీబీ ముందు బక్కెట్‌లో కూర్చుని ఎంట్రీ ఇచ్చారు.
వారిని చూసిన వారంతా నవ్వుతూ చప్పట్లు కొడుతూ ఉత్సాహపరిచారు. అయితే ఇంతలో ఏమైందో జేసీబీ బక్కెట్ ఒక్కసారిగా కిందకి వంగిపోయింది. అంతే దాదాపు 10 నుంచి 15 అడుగుల ఎత్తు నుంచి వధూవరులిద్దరూ కిందపడిపోయారు.
అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ తిన్నారు. తర్వాత ఆ జంటను పైకి లేపారు.