
Nasa | టోంగా దేశ సమీపంలో పసిఫిక్ సముద్రంలో జరిగిన అగ్నిపర్వత పేలుడు యావత్ ప్రపంచాన్ని హడలెత్తించింది. ఈ పేలుడు సముద్రంలో జరిగినప్పటికీ భూభాగంపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. ఆ శబ్దానికి టోంగా దేశమంతా కాసేపు చెవిటిదైపోయిందని కూడా కొందరు చెప్పారు. ఈ పేలుడు ప్రభావం అంతరిక్షంలోకి సైతం కనిపించింది.
అయితే తాజాగా ఈ పేలుడు గురించి మరో ఆసక్తికర విషయాన్ని నాసా పంచుకుంది. ఈ పేలుడు కారణంగా వచ్చిన పొగ కాసేపటికి వరకు చుట్టుపక్కల ప్రాంతాలను కారుచీకట్ల ముంచేసింది.
అయితే ఈ పొగ స్పేస్ స్టేషన్‌లోని వారికి కూడా కనిపించింది. అది కూడా ఎటువంటి పరికరం వాడకుండానే కనిపించిందని నాసా ట్వీట్ చేసింది.
స్పేస్ స్టేషన్ ఆదివారం న్యూజిల్యాండ్ మీదుగా వెళుతుండాగా ఆస్ట్రోనాట్ కైలా బోరాన్ స్పేస్ స్టేషన్ కిటికీ తలుపు తీశారని, అప్పుడే వారు ఆకాశంలో టోంగా పర్వత పేలుడు వల్ల వచ్చిన పొగను చూశారని నాసా తన ట్వీట్‌లో పేర్కొంది.
అంతేకాకుండా దీనికి సంబంధించిన ఫొటోలను సైతం షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
#Tonga #VolcanicEruption #ISS #Nasa