

Giant Couple | మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. మనకోసం ఎవరో ఒకరు ఎక్కడో ఓ చోట పుట్టే ఉంటారు. ఇలాంటి మాటలు చాలానే వింటుంటాం. కానీ ఇప్పుడు చెప్పబోయే జంట మాత్రం.. ఎవరో ఒకరు కాదు.. ఒకరికోసం ఒకరు పుట్టారు.
వాళ్ల పేర్లు మార్టిన్ వాన్ బ్యూరెన్(Martin Van Buren), అన్నా హెయినింగ్ స్వాన్(Anna Haining Swan). వీళ్లలో ఇంగ్లండ్‌లోని కెంటక్కీకి చెందిన మార్టిన్ బ్యూరెన్.. ఎత్తు 7 అడుగుల ఏడున్నర అంగుళాలు. 149 కేజీలు. మార్టిన్‌ను చూసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వాళ్లు కూడా కళ్లు మూసుకుని ఆయన పేరు తమ బుక్‌లో రకరకాల రికార్డులిస్తూ రాసేసుకున్నారు.
ఇది కూడా చదవండి: Viral Villages | ప్రపంచంలోనే వింతైన గ్రామాలు
అంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు మార్టిన్‌కి పెళ్లి ఎలా..? ఇంత రాక్షస ఆకారానికి పిల్లని ఎక్కడ వెతకాలి..? ఎక్కడెక్కడో వెతికితే దొరికిందో ఎత్తైన చక్కని చుక్క. అన్నా హైనింగ్ స్వాన్. అన్నా ఎత్తు 7.9 అడుగులు. అంటే బ్యూరెన్ కంటే ఎత్తున్నమాట.
వీళ్లిద్దరికీ వైభవంగా పెళ్లి చేసిన తర్వాత.. ఈ భారీ జంట(Giant Couple) ఓ అందమైన పాపకు కూడా జన్మనిచ్చారు. అయితే పుట్టిన పాప మాత్రం వాళ్లలా అంత ఎత్తులో లేదు. సాధారణ ఎత్తులోనే మనందరిలానే ఉంది.
#Gaint #England #Marrige #Record