Lonar Lake | లోనార్ సరోవర్.. ప్రపంచంలో ఇదొక్కటే..!

Lonar Lake

Lonar Lake | ప్రపంచంలోనే ఇలాంటి మిస్టరీ ఉన్న సరస్సు మరొకటి లేదని అనేక దేశాల శాస్త్రవేత్తలు వాళ్లంతట వాళ్లే ఒప్పుకున్నారు. ఇప్పటికీ దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలని ఇంకా ఎంతోమంది ప్రయత్నిస్తూనే ఉన్నారు.
కానీ అందులోని రహస్యాలను ఛేదించడంలో ఎప్పటికప్పుడు ఫెయిల్ అవుతూనే ఉన్నారు. ఇంతకీ ఏం సరస్సు అది. అందులో ఉన్న మిస్టరీ ఏంటి..? ఇప్పుడు చూద్దాం.
వేల ఏళ్ల క్రితం భూమిపై ఓ గ్రహశకలం పడింది. ఆ విస్ఫోటనంతో దెబ్బకు అక్కడ పెద్ద లోయ ఏర్పడి కాల క్రమంలో అదే ఓ సరస్సుగా మారింది. అయితే ఇది కనిపించడానికి సాధారణ సరస్సులా కనిపించినా.. ప్రపంచంలోనే వైవిధ్యభరితమైన సరస్సు ఇది.

ఇది మహారాష్ట్రలో ఉంది. అక్కడి బుల్ధానా జిల్లాలో ఉన్న లోనార్ అనే ప్రాంతంలో ఈ సరస్సు ఏర్పడింది.
1.8 కిలోమీటర్ పరిథిలో 1.2 కిలోమీటర్ల వెడల్పులో ఈ సరస్సు ఉంటుంది. దీని లోతు 150 మీటర్ల వరకు ఉంటుందని అంచనా.
ప్రపంచంలోనే బాసాల్టిక్ బెడ్‌రాక్‌లో ఏర్పడిన సరస్సు ఇదొక్కటే. ఇక్కడ ఇంకో మిస్టరీ ఏంటంటే.. ఈ సరస్సు ఏర్పడి ఎన్నేళ్లు గడిచిందో శాస్త్రవేత్తలు అంచనా వేయలేకపోతున్నారు.
కొంతమంది 52వేల ఏళ్ల క్రితం పుట్టిందంటే.. ఇంకొంతమంది కాదు అంతకంటే ముందే ఇది ఏర్పడి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఇక దీని పుట్టుకపై కూడా రకరకాల థియరీలున్నాయి. కొంతమంది ఈ సరస్సు ఉన్న చోట ఒకప్పుడు అగ్నిపర్వతం ఉండేదని, ఇప్పుడు సరస్సుగా మారిందని అంటారు.

కానీ ఎక్కువమంది అంతరిక్షం నుంచి వచ్చిన ఓ భారీ గ్రహశకలం ఢీకొనడం వల్లే ఇది పుట్టిందంటారు.
అంతేకాదు.. ఆ గ్రహశకలం 2మిలియన్ టన్నులు.. అంటే 20 లక్షల కేజీలుంటుందని, దాదాపు గంటలకు 90 వేల కిలోమీటర్ల వేగంతో వచ్చి ఢీకొందని అంటారు.
ఈ సరస్సులో నీరు రెండు రకాలుగా ఉంటుంది. ఉపరితలంపై ఉండే నీరు చప్పగా ఉంటుంది. అలాగే లోపల ఉండే నీరు సముద్రపు నీరులా ఉప్పగా ఉంటుంది. ఇలా రెండు రకాల నీరు ఇందులో ఎలా ఉంటుందో శాస్త్రవేత్తలకు ఇప్పటికీ అర్థం కావడం లేదు.

అలాగే ప్రపంచంలో అత్యంత అరుదుగా కనిపించే బాక్టీరియాలు, సూక్ష్మజీవులు కూడా ఈ సరస్సులో ఉంటాయి. ఇది కూడా ఓ మిస్టరీనే.
అంతేకాదు.. ఈ సరస్సులో కొన్ని చోట్ల అయస్కాంత క్షేత్రాలు ఏర్పడి సిగ్నల్స్ పనిచేయవు కూడా. ఇంత రహస్యమైన సరస్సు ప్రపంచంలోనే ఎక్కడా లేదు.
ఈ సరస్సుపై ఎన్నో ఏళ్ల నుంచి పరిశోధనలు జరుగుతున్నా.. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పటికీ శాస్త్రవేత్తలు కనిపెట్టలేకపోయారు.
అయితే గతేడాది జూన్‌లో ఈ సరస్సు అందరికీ మరో ట్విస్ట్ ఇచ్చింది. ఉన్నట్లుంది ఒక్కసారిగా పింక్ రంగులోకి మారిపోయింది.
పరీక్షించగా.. అందులో ఉండే బాక్టీరియా వల్లే ఇది ఈ రంగులోకి మారిపోయిందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు.
#LonarLake #Maharashtra