

Viral | తల్లి, తండ్రి తరువాత అంతటి స్థానం ఇవ్వాల్సిన గురువును ఘోరంగా అవమానించారు విద్యార్థులు. టీచర్ తలపై చెత్త బుట్టను బోర్లించి ఆయనను అపహాస్యం చేశారు. ఆయన వయసుకు గౌరవం ఇవ్వకుండా చెత్తబుట్టతో కొడతామని బెదిరించి మరీ తలపై బోర్లించారు. ఈ వీడియోను వాళ్లే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విపరీతంగా వైరల్ అయింది.
ఈ ఘటన కర్ణాటకలోని దేవనాగరి జిల్లాలో జరిగింది. స్థానిక చన్నగిరి పట్టణంలోని నల్లూరులో ఉన్న ఓ హైస్కూల్‌లో ఇది జరిగినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 3వ తేదీన జరిగిన ఈ ఘటనపై రాష్ట్ర ప్రాథమిక, ఉన్నత విద్యాశాఖా మంత్రి బీసీ నగేష్ స్పందించారు. ట్విటర్‌లో ఆయన.. ‘విద్యార్థుల చర్యను సహించేది లేదు. దీనిపై ఇప్పటికే విద్యాశాఖ, పోలీసుల దర్యాప్తులు ఆదేశించాం. కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించాం. మేము ఎప్పుడూ ఉపాధ్యాయులకు మద్దతుగా ఉంటాం’ అని పేర్కొన్నారు.
#Karnataka #Teacher #Students #ViralVideo