Shocking | ఆస్టరాయిడ్లు భూమిని బద్దలు చేసేస్తాయా..?

Shocking | ఓ భారీ ఆస్టరాయిడ్ గుద్దుకోవడంతో భూమిపై డైనోసార్లు అంతరించిపోయాయి. ఇదే చెబుతారు శాస్త్రవేత్తలు. అంటే అంతరిక్షం నుంచి

Spread the love
Shocking
Shocking

Shocking | ఓ భారీ ఆస్టరాయిడ్ గుద్దుకోవడంతో భూమిపై డైనోసార్లు అంతరించిపోయాయి. ఇదే చెబుతారు శాస్త్రవేత్తలు.

అంటే అంతరిక్షం నుంచి వచ్చిన ఓ రాయికి భూమ్మీదున్న జీవరాసి మొత్తాన్ని తుడిచిపెట్టే శక్తి ఉంటుందనే కదా. కానీ అలాంటి గ్రహశకలాలు ఇంకా ఇంకా భూమివైపు దూసుకొస్తున్నాయి. 2001 WN5, అపోఫిస్, 2008 DB.. ఇలాంటివన్నీ అలాంటి గ్రహశకలాలే.

ఇప్పటికే శాస్త్రవేత్తలు గుర్తించిన ఆస్టరాయిడ్స్‌లో ఇవే పెద్దవి. వీటిలో చాలా వరకు భూమికి అతి దగ్గరగా వచ్చి వెళ్లేవే. ఇవన్నీ భవిష్యత్తులో అంటే దాదాపు ఓ 100 ఏళ్లలో భూమికి చేరువగా వస్తాయి.

కానీ.. ఇక్కడే ఓ చిన్న ప్రశ్న. ఇప్పుడు మనం చెప్పుకుంది శాస్త్రవేత్తలు కనిపెట్టిన ఆస్టరాయిడ్స్ గురించి. శాస్త్రవేత్తలు కనిపెట్టినవే ఇన్ని ఉంటే.. ఇంకా కనిపెట్టాల్సినవి, కనిపెట్టలేనివి ఇంకెన్ని ఉంటాయి..?

ఆస్టరాయిడ్ అంటే..

మన సౌరకుటుంబం ఏర్పడినప్పుడు ఎన్నో రాళ్లు ఒకదానితో ఒకటి ఢీ కొని పెద్ద పెద్ద గ్రహాలుగా అవతరించాయి.

ఇప్పుడు మనం చూస్తున్న బుధ గ్రహం(Mercury), శుక్ర గ్రహం(Venus), అంగారక గ్రహం(Mars).. అంతెందుకు మన భూమి కూడా అలా ఏర్పడిన గ్రహమే.

కానీ అలా ఏ గ్రహంతోనూ కలవకుండా మిగిలిపోయిన శకలాలే ఈ ఆస్టరాయిడ్స్.

వీటిలో కొన్ని ఆస్టరాయిడ్స్ రాళ్లతో నిండి ఉండే. ఇంకొన్ని ఐరన్, నికెల్, మెగ్నీషియం.. ఇలా మనిషి ఊహకు అందని ఖనిజాలతో ఏర్పడ్డాయి.

ఆస్టరాయిడ్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకున్నారు కదా. ఇప్పుడు భూమి చుట్టూ ఉండే ఆస్టరాయిడ్స్‌ గరించి తెలుసుకుందాం.

ఆస్టరాయిడ్స్ అనగానే మార్స్ తరువాత, ఉండే ఆస్టరాయిడ్ బెల్ట్, చివర్లో ప్లూటో తర్వాత ఉండే కెప్లర్ బెల్ట్ మాత్రమే తెలుసు.

కానీ నిజానికి ఇవి మాత్రమే కాదు.. మనభూమి చుట్టూ, ప్రతి గ్రహం చూట్టు లక్షల కొద్దీ ఆసట్రాయిడ్స్ తిరుగుతూ ఉంటాయి.

వాటిలో చాలా ఆస్టరాయిడ్స్ గ్రహాలను ఢీ కొడుతూ ఉంటాయి. మన భూమికి దగ్గరలో ఉన్న అలాంటి ఆస్టరాయిడ్స్‌ని NEOs.. అంటే Near Earth Objects అంటారు. ఇవి కూడా భూమి వైపు దూసుకొస్తాయి.

కానీ మన భూమికున్న ప్లస్ పాయింట్ ఏంటంటే.. మన సౌరకుటుంబంలో వాతావరణం ఉన్న ఏకైక గ్రహం కావడమే.

ఈ వాతావరణంలోకి వచ్చిన ఆస్టరాయిడ్స్ ఆ ఒత్తిడి వల్ల అక్కడే పేలిపోతాయి.

అలా పేలనివాటి వల్లే మనకు డేంజర్. మాజీ ఆస్ట్రో ఫిజిసిస్ట్ స్టీఫెన్ హాకింగ్స్ కూడా ఇదే మాట చెప్పారు. భూమికి ఎప్పటికైనా డేంజర్.. ఈ ఆస్టరాయిడ్స్ వల్లేనని ఆయన హెచ్చరించారు.

ఆస్టరాయిడ్స్‌ని ఎలా కనిపెడతారు..?

ఆకాశంలో కదులుతున్న ఏ వస్తువునైనా, అది ఆస్టరాయిడ్స్‌ కానీ ఏదైనా ఇతర నక్షత్రాలు కానీ.. ఏదైనా భూమిపై ఉన్న టెలిస్కోపులతోనే సాధ్యం.

ఆ టెలిస్కోపులతో ఓ నిర్ణీత సమయంలో తీసిన ఫోటోలను కలిపి ఏదైనా కదులుతుందేమో చూస్తారు.

అలా కదిలినప్పుడు.. దానిపై పడే సూర్యాకాంతి, దాని నుంచి విడుదలవుతున్న కాంతి, వేగం, పరిణామం లాంటి పాయింట్స్ అన్నీ నోట్ చేసుకుని అది ఏంటో గుర్తిస్తారు. కానీ ఇది అంత ఈజీ పని కాదు.

ఎందుకంటే.. ఆస్టరాయిడ్స్‌ సొంతంగా ప్రకాశించవు. వీటిపై సూర్యకాంతి పడినా.. అందులో 15శాతం మాత్రమే రిఫ్లెక్ట్ అవుతుంది.

అందుకే వీటిని కనిపెట్టడంలో శాస్త్రవేత్తలకు సమస్యలు ఎదురవుతున్నాయి.

అయితే సూర్యుడికి ఎదురుగా ఉన్న ఆస్టరాయిడ్స్‌ని మాత్రం మన శాస్త్రవేత్తలు గుర్తించగలుగుతున్నారు.

ఒకవేళ ఏదైనా ఆస్టరాయిడ్ భూమికి, సూర్యడికి మధ్య నుంచి భూమి వైపు దూసుకొస్తే మాత్రం దానిని గుర్తించడం సాధ్యం కాదన్నమాట.

ఇలాంటి ఆస్టరాయిడ్ ఒకటి 2013 ఫిబ్రవరి 13న రష్యాలోని చెల్యబిన్స్‌క్ నగరంపై పడింది. దాని బరువు 9,100 మెట్రిక్ టన్నులు.

అయితే అదృష్టవశాత్తూ భూ వాతావరణంలోకి ప్రవేశించిన తర్వాత మరో 30 కిలోమీటర్లలో నేలను తాకుతుందనగా ఇది పేలిపోయింది.

దాని వల్ల కలిగిన షాక్ వేవ్ వల్ల వేల మంది గాయపడ్డారు. ఎన్నో ఇళ్లు కూలిపోయాయి.

నిజానికి అదే రోజు ఓ ఆస్టరాయిడ్ భూమికి అతి దగ్గరగా వచ్చి వెళ్లిపోతుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. కానీ అది ఇది కాదు.

శాస్త్రవేత్తలు కనిపెట్టిన ఆస్టరాయిడ్.. వాళ్లు అనుకున్నట్లే 27వేల కిలోమీటర్ల దూరం నుంచి వెళ్లిపోయింది.

కానీ చెల్యబిన్స్‌కి కనిపెట్టడంలో శాస్త్రవేత్తలు ఫెయిల్ అయ్యారు. కారణం ఇది సూర్యుడి వైపు నుంచి రావడమే.

ఇదొక్కటే కాదు.. ఇలాంటి ఆస్టరాయిడ్స్ ఇంకా ఎన్నో ఉన్నాయి మన భూమి చూట్టూ. ఓ లెక్క ప్రకారం చెప్పాలంటే 1988 నుంచి దాదాపు ఓ మీటర్ కంటే పెద్దవేన ఆస్టరాయిడ్స్ 1200 దాకా భూమిని ఢీకొట్టాయి.

కానీ వాటిలో శాస్త్రవేత్తలు కనిపెట్టినవి ఎన్నో తెలుసా..? కేవలం 5. ఆశ్చర్యంగా ఉన్నా.. ఇదే నిజం. అంటే ఎన్నో గ్రహశకలాలు భూమిని ఢీకొట్టిన తర్వాత కానీ మనకు తెలియదన్నమాట.

అంటే భూమికి తీవ్రమైన నష్టం కలిగించగలిగే ఇలాంటి ఇంకెన్నో ఆస్టరాయిడ్స్ భూమి చుట్టూ కనిపించకుండా తిరుగుతున్నాయి.

అంతేకాదు.. ప్రస్తుతం మనదగ్గరఉన్న టెక్నాలజీతో ఓ ఆస్టరాయిడ్‌ని మనం కనిపెట్టగలిగినా.. అది ఎటు ప్రయాణిస్తుంది..? అనే విషయాన్ని కనిపెట్టడం చాలా కష్టమట. ఒకవేళ కనిపెట్టినా.. అది 100 ఏళ్లలో ఎటు ప్రయాణిస్తుంది..? అనే విషయం మాత్రమే అంచనా వేయగలరట.

ఇప్పటివరకు మొత్తం 4 రకాల ఆస్టరాయిడ్స్‌ని కనిపెట్టారు శాస్త్రవేత్తలు. అవి:

మొదటిది అమోర్ క్లాస్ ఆర్బిట్‌లో తిరిగే ఆస్టరాయిడ్స్. ఇవి భూమికి చాలా దూరంగా తిరుగుతాయి. వీటితో ఎలాంటి డేంజర్ ఉండదు.

రెండోది అపోలో క్లాస్ ఆస్టరాయిడ్స్. వీటి ఆర్బిట్ సూర్యుడికి, భూమికి మధ్యలో నుంచి వెళుతుంది. ఇవి భూమికి సూర్యుడికి మధ్యలో, భూమికి దగ్గరగా వస్తుంటాయి. రష్యాలో కూలిన చెల్యబిన్స్‌క్ ఆస్టరాయిడ్ ఈ కేటగిరీకి చెందినదే.

మూడోది అట్టెన్స్ క్లాస్ ఆస్టరాయిడ్. 2029లో భూమికి అతి చేరవగా రాబోతున్న ఆపోఫిస్ ఈ క్లాస్‌కు చెందిన గ్రహశకలమే. వీటి ఆర్బిట్ భూ కక్ష్యలో నుంచి ఉంటుంది. ఇవి ఏ క్షణంలో అయినా భూమిని ఢీకొట్టవచ్చు.

నాలుగోది అటీరా క్లాస్ ఆర్బిట్‌లో తిరిగే ఆస్టరాయిడ్స్. ఇవి భూ కక్ష్యలోకి ఏ మాత్రం రావు. అయితే ఈ అంచనా కేవలం 100 ఏళ్ల వరకే పరిమితం ఆ తర్వాత ఆస్టరాయిడ్స్ ఊహించని టర్నింగ్ తీసుకోవచ్చు.

ఓ ఆస్టరాయిడ్ పవర్ ఎంత..?:

సాధారణంగా ఓ మనిషి ఎత్తు అంటే దాదాపు ఓ 5 అడుగులు ఎత్తున్న ఆస్టరాయిడ్ భూమిని ఢీకొంటే.. 47 టన్నుల టీఎన్‌టీ బాంబులు పేలినంత ప్రభావం ఉంటుంది.

ఇవి భూమి వాతావరణంలోకి ప్రవేశించగానే పేలిపోతాయి. ఏ ఆస్టరాయిడ్ అయినా.. భూమికి ఢీకొట్టాలంటే కనీసం 220 మీటర్లు అంటే 660 అడుగుల పరిమాణం ఉండాలి. ఆ స్థాయి ఆస్టరాయిడ్ భూమిని ఢీకొంటే.. 250 మిలియన్ టన్నుల టీఎన్‌టీ పేలినంత ప్రభావం ఉంటుంది.

ఇది దాదాపు ఓ రాష్ట్రాన్ని పూర్తిగా తుడిచిపెట్టేస్తుంది. ఒక కిలో మీటర్ పరిమాణం ఉన్న ఆస్టరాయిడ్‌కి 45 బిలియన్ టన్నుల టీఎన్‌‌టీ పేలినంత ప్రభావం ఉంటుంది. ఇది ఓ దేశాన్ని అంతం చేస్తుంది.

100 కిలోమీటర్ల సైజ్ ఉన్న ఆస్టరాయిడ్‌కి 850 పెటీలియన్ టన్స్ టీఎన్‌టీ బాంబులకు ఉన్నంత పవర్ ఉంటుంది. ఇది ఓ ఖండాన్నే నామరూపాలు లేకుండా చేస్తుంది.

ఇక చివరిగా మనకు తెలిసిన అతి పెద్ద ఆస్టరాయిడ్ ‘సిరీస్’ లాంటి 900 కిలోమీటర్ల సైజున్న ఆస్టరాయిడ్ భూమిని ఢీకొంటే భూమి పూర్తిగా నాశనం అయిపోతుంది. మొత్తం లావాతో నిండిపోతుంది.

ఒక్క ప్రాణి కూడా బతికే ఛాన్స్ ఉండదు. సౌరకుంటుంబంలోనే ప్రత్యేకమైన గ్రహం.. మండే అగ్నిగోళంలా తయారవుతుంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *