Petrol Fraud | చేతివాటం ప్రదర్శిస్తే బేడీలే: రఘునందన్ మాచన

Raghunandan Machana

Raghunandan Machana | పెట్రోల్ బంక్ ల్లో చేతి వాటం తో వినియోగ దారులను మోసం చేస్తే శిక్ష తప్పదని పౌరసరఫరాలశాఖ నారాయణపేట జిల్లా ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తహసీల్దార్ రఘునందన్ మాచన స్పష్టం చేశారు.
ధన్వాడ భారత్ పెట్రోలియం డీలరు శ్రీ రాఘవేంద్ర ఫిల్లింగ్ స్టేషన్‌లో ఆయన తనిఖీలు నిర్వహించిన నేపథ్యంలో అక్కడ అవకతవకలు జరుగుతున్నట్లు గుర్తించారు రఘునందన్. వెంటనే ఆయన పెట్రోల్ బంకు యాజమాన్యానికి నేరుగా లేఖ రాశారు. బంకులో జరుగుతున్న అక్రమాలకు కారణమైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.
అలాగే బంకు యాజమాన్యం, నిర్వాహకులు, పనిచేసే వారు అంతా వినియోగదారుల పట్ల సేవాభావంతో భాధ్యతగా ప్రవర్తించాలని సూచించారు.
పెట్రోల్ బంకులు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్రేజలకు ఇబ్బందులు కలుగకుండా, ఎలాంటి అన్యాయం జరగకుండా చర్యలు తీసుకోవాలని, లేకపోతే బంకు అనుమతి రద్దు చేసేందుకు కూడా వెనుకాడమని హెచ్చరించారు.
వినియోగదారులు కూడా ఇలాంటి విషయాల్లో చైతన్యవంతులై ఉంటే మోసాలను ఎదుర్కోవచ్చని రఘునందన్ సూచించారు.
కాగా.. రఘునందన్‌కు అవినీతి ఎరుగని అధికారిగా గొప్ప పేరుంది. ఆయన పౌరసరఫరాల శాఖ అధికారిగా పనిచేయడమే కాకుండా పొగాకు వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటం చేస్తున్నారు.
ఆయన పోరాటానికి ఇప్పటికే దేశవిదేశాలలో గుర్తింపు లభించింది. అంతేకాకుండా తన పరిథిలో ఎక్కడా అవినీతి జరగకుండా చూసుకుంటారాయన. రేషన్ బియ్యం అక్రమ రవాణా, పెట్రోల్ కల్తీ వంటి సమస్యలకు స్వయంగా ఎన్నోసార్లు ఆకస్మిక తనిఖీలు జరిపి నిందితులను పట్టుకున్నారు.
అటు వృత్తిలోనే కాకుండా ఇటు సంఘసేవలోనూ ఆయనకు ఆయనే సాటి అని స్థానికులు రఘునందన్ మాచనను ప్రశంసిస్తున్నారు.
#RaghunandanMachana #NarayanPet #PetrolBunk #Raid #DeputyTehsildar