

PM Modi | ప్రధాని నరేంద్ర మోదీ 75ఏళ్ల నాటి కొన్ని ఫోటోలను షేర్ చేశారు. ట్విటర్లో ఈ ఫోటోలను షేర్ చేశారు. ఈ ఫోటోల్లో భారతదేశానికి స్వాతంత్ర్యం రాక ముందు భారతదేశ ప్రతినిథులంతా కలిసి నిర్వహించిన రాజ్యంగ సమితి సమావేశం ఇది. 1946 డిసెంబర్ 9న ఈ సమావేశం జరిగింది.
ఈ ఫోటోలను షేర్ చేసిన ప్రధాని మోదీ.. ‘భారతదేశాన్ని నడిపించగల, భారతప్రజల ఆకాంక్షలకు తగినట్లుగా రాజ్యాంగాన్నినిర్మించేందుకు దేశంలో వేరు వేరు ప్రాంతాలకు చెందిన, రకరకాల నేపథ్యాలు కలిగిన నేతలంతా ఒక చోట కలిశారు.’ అని మోదీ ఈ ట్వీట్‌లో పేర్కొన్నారు. అలాగే వారందరికీ నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు.
#PMModi #Independance #Twitter #Viral