Beer | ఛీ.. ఛీ.. ఇదెక్కడి బీర్.. బొద్దింకలని ఉడబెట్టి తీస్తారా..?

beer

New beer | బీర్ అనగానే కుర్రోళ్లకి నోరూరిపోతుంది. స్టైల్‌గా గ్లాసుల్లో చీర్స్ కొట్టినా.. రఫ్‌గా బీర్ సీసా ఎత్తి తాగినా.. దొరికే మజానే వేరంటుంటారు కొంతమంది కుర్రోళ్లు.
అయితే ఇప్పటివరకు ఎన్ని రకాల బీర్‌లు తాగారో కానీ ఇప్పుడు చెప్పబోయే బీర్ గురించి చెబితే మాత్రం.. బీర్ పేరు చెబితేనే వాంతులు చేసుకుంటారు.
ఎందుకంటే ఈ బీర్ ఇప్పటివరకు మార్కెట్లోకి వచ్చన మిగతా బీర్లలా పండ్లతో తయారు చేసింది కాదు.. బొద్దింకలతో తయారు చేసింది.
జపాన్‌లో ఈ కాక్‌రోచ్ బీర్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతోంది. జపాన్‌లో ఉండే ఓ రకమైన నీటి బొద్దింకలను బాగా ఉడకబెట్టి, ఆ తర్వాత ఓ వారం రోజులు కుళ్లబెట్టి.. అప్పుడు వాటిని బాగా పిండి వాటి నుంచి వచ్చిన రసాన్ని బీర్‌గా ఇస్తున్నారు.

ఈ బీర్ కోసం ఇప్పుడు జపాన్‌లో జనాలు క్యూలు కడుతున్నారు.
కొద్దిగా పుల్లగా ఉన్నా భలే ఉంటుందని, తెల్లగా ఏదో కూల్ డ్రింక్‌లా ఇది కనిపిస్తుందని అంటున్నారు. అంతేకాదు.. మనుషుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్న ప్రస్తుత కాలంలో కీటకాలను తినడం నేర్చుకుంటే ఆహార కొరతను కూడా అధిగమించొచ్చని ఓ ఉచిత సలహా కూడా ఇస్తున్నారు.
మరి ఈ ఉచిత సలహా మీరు పాటిస్తారా..?
#NewBeer #CockroachBeer #Japan #Viral