

Meet Sikkim Model Cop Eksha | అందానికే అందం ఆమె. ఆమె ఫోటోలు కుర్రకారుకు మతిపోగొడతాయి. మోడ్రన్ డ్రెస్స్‌ల్లో సినిమా హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోదు. ఆమె అందం, నాజూకుతనం.. అబ్బో అలా చూస్తూనే ఉండాలనిపిస్తోంది. కట్ చేస్తే.. పోలీస్ డ్రెస్‌లో ఠీవీగా, చట్టానికి ప్రతిరూపంగా కనిపిస్తుందామె.
అటు మోడ్రన్ డ్రెస్సుల్లో అందాలు ఒకలబోస్తూ.. ఇటు పోలీస్ యూనిఫాంలో ధైర్యసాహసాలతో అదరగొడుతున్న ఆమె పేరు ఇక్ష హాంగ్ సుబ్బా అలియాజ్ ఇక్ష కెరుంగ్. సిక్కిం పోలీస్ ఫోర్స్‌లో పనిచేస్తున్నారామె. ఒకపక్క పోలీస్ అధికారిగా పనిచేస్తూనే.. మరోపక్క సూపర్‌మోడల్‌గా అందంతో మాయచేస్తుంటారు. అంతేకాదు.. ఇక్ష ప్రొఫెషనల్ బాక్సర్, బైకర్ కూడా.
ఆమె జీవితం ఎంతోమందికి ఆదర్శం. జీవితంలో నచ్చినదాన్ని దేనినీ వదులుకోకూడదని ఇక్ష నమ్ముతారు. అందుకే తనకు ఇష్టమైన ప్రతి రంగంలోనూ కష్టపడి రాణిస్తున్నానని అంటారు. ఏది ఏమైనా మహిళలు తలుచుకుంటే ఏమైనా చేయగలరు, ఎంతైనా సాధించగలరు అనడానికి ఇక్ష ఓ చక్కటి ఉదాహరణ. అందులో సందేహమే లేదు.