

Dog birthday | తన పెంపుడు కుక్క పుట్టిన రోజు వేడుకలని ఘనంగా జరుపుకున్నాడో వ్యక్తి. ఈ విషయం తెలిసిన వెంటనే ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ షాకింగ్ ఘటన గుజరాత్ లో జరిగింది.
అహ్మదాబాద్ లోని నికోల్ ప్రాంతంలో చిరాజ్ అలియాజ్ డాగో పటేల్ కొద్దీ రోజుల క్రితం తమ పెంపుడు కుక్క ఆబీ(Abby) పుట్టిన రోజు( Dog birthday )ని ఘనంగా జరపాలనుకున్నాడు.
అంతే ఓ పెద్ద హోటల్ బుక్ చేసి గ్రాండ్ సెలిబ్రేషన్స్ ఏర్పాటు చేశాడు. తెలిసిన వాళ్ళందరినీ ఆహ్వానించాడు. భారీ స్టేజి, ఆబీ ఫోటో గ్యాలరీలతో అదిరిపోయే అలంకరణ చేశాడు. దీనికోసం దాదాపు రూ.7 లక్షల వరకు ఖర్చు చేశాడు.
ఈ సెలెబ్రేషన్స్ చూసి ఆ ఫంక్షన్ కి వచ్చిన వాళ్ళతో పాటు.. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో నెటిజన్లు కూడా ఆశ్చర్యపోయారు. దీంతో తెగ షేర్లు చేసి వీడియోని వైరల్ చేశారు. అలా ఈ వీడియో గుజరాత్ పోలీసుల కంటపడింది.
ఓ పక్క దేశంలో కోవిడ్ మహమ్మారి విజృంభిస్తూ.. థర్డ్ వేవ్ వస్తుందేమో అనే భయంతో.. ఎక్కడికక్కడ ప్రభుత్వాలు, పోలీసులు పటిష్ట నిబంధనలు అమలు చేస్తూ జాగ్రత్త తీసుకుంటుంటే.. మరోపక్క ఇలాంటి పార్టీ జరిగిందని తెలియడంతో పోలీసులకి కోపం తారాస్థాయికి చేరింది. అంతే డోగా పటేల్ తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసి సెల్ లో వేశారు.
కోవిడ్ నిబంధనలను అతిక్రమించి లెక్కకు మించిన జనాలతో పార్టీ నిర్వహించినందుకే అరెస్ట్ చేశామని వెల్లడించారు పోలీసులు.
ఈ విషయం తెగేలియడంతో నెటిజన్లు కూడా ‘తగిన శాస్తి జరిగింది. జనాలు ఆకలితో అలమటిస్తుంటే కుక్కకి అంత ఖర్చుపెట్టి పార్టీ చేస్తాడా..?’ అంటూ చురకలంటిస్తుంటే..
ఇంకొంతమందేమో ‘కుక్క పేరు చెప్పి మీరు పార్టీ చేసుకున్నారు. ఇప్పుడు తిక్క కుదిరింది’ అంటూ జోకులు పిలుస్తున్నారు.
#DogBirthday #Birthday #Gujarat #Ahmedabad #Arrest #CovidNorms