Sunny leone | సన్నీ లియోన్ పై కోర్టుకెక్కుతా..!

Sunny leone | సన్నీ లియోన్ పై కోర్టుకెక్కుతానని మధ్య ప్రదేశ్ హోమ్ మంత్రి నరోత్తం మిశ్రా హెచ్చరించారు. ఈ మధ్యనే సన్నీ లియోన్

Spread the love
Sunny leone
Sunny leone

Sunny leone | సన్నీ లియోన్ పై కోర్టుకెక్కుతానని మధ్య ప్రదేశ్ హోమ్ మంత్రి నరోత్తం మిశ్రా హెచ్చరించారు. ఈ మధ్యనే సన్నీ లియోన్ నటించిన ప్రైవేట్ ఆల్బమ్ ‘మధుబన్ మే రాధికా నాచే’అనే పాట సోషల్ మీడియాలో విడుదలైంది. ఈ పాట హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా ఉందని, రాధ వ్యక్తిత్వాన్ని తక్కువ చేసి చూపించేలా ఈ పాట ఉందని ఆయన ఆరోపించారు. రాధ కు భారతదేశంలో ఆలయాలున్నాయని, ఆమెను ఈ దేశంలో పూజిస్తారని, అలాంటి స్త్రీపై ఇలాంటి పాట చేయడం సరికాదని అన్నారు. 3 రోజుల్లో సోషల్ మీడియా నుంచి పాటను తొలగించాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, అది ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సన్నీ లియోన్ తో పాటు పాట రచయిత సాదిక్ తోషిని కూడా హెచ్చరించారు.

కాగా ఈ పాటపై ఇప్పటికే అనేకమంది హిందువులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్యనే మతురలోని పూజారులు కూడా ఈ పాట కృష్ణుడిపై రాధకు ఉన్న నిష్కల్మషమైన ప్రేమను, ఆరాధనను కించపరిచేలా ఉందని, ఈ పాటను వెంటనే బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. అయితే దీనిపై సన్నీ లియోన్ నుంచి కానీ సాదిక్ నుంచి కానీ ఇంకా ఎలాంటి స్పందనా రాలేదు.

SunnyLeone #BanMadhubanMeinRadhikaNache #MadhyaPradesh #NarottamMishra

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *