

Lion vs Dog | సింహంతో కుక్క ఫైట్‌కి దిగితే ఎవరు గెలుస్తారు..? కచ్చితంగా సింహం. అందులో డౌటే లేదు. కానీ సింహం ఎదురొచ్చినా.. కదలకుండా కూర్చుందో కుక్క. కొన్ని అంగుళాల దూరంలో నిలబడి తన పంజాలు విసురుతున్నా.. భయం అనేదే లేకుండా చూస్తూ ఉంది ఆ కుక్క. అదెలా సాధ్యం అనుకుంటున్నారా..? అయితే ఈ వీడియో చూడండి.
ఈ వీడియో సారా అనే మహిళ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ఆమె ఇంటికొచ్చేసరికి ఇంటి వెనక వరండాలోకి ఓ మౌంటెయిన్ లయన్ వచ్చింది. అది వచ్చే టైంకి సారా పెంపుడు కుక్క డ్యాష్ మూసి ఉన్న వరండా తలుపులో నుంచి బయట ఉన్న సింహాన్ని చూస్తోంది. సింహం కూడా డ్యాష్‌ను చూసింది. దగ్గరకొచ్చి గాజు తలుపుపై పంజాతో తట్టడం మొదలుపెట్టింది. సింహం అంత దగ్గరగా వచ్చినా.. డ్యాష్ భయపడడం లేదు. అప్పటికే ఈ దృశ్యాలను తన మొబైల్‌లో రికార్డు చేస్తోంది సారా. భయంతోనే డ్యాష్‌ను వెనక్కి పిలిచింది. కానీ డ్యాష్ అక్కడి నుంచి కదలడం లేదు. దాదాపు 3 నిముషాలు తలుపు వద్ద తచ్చాడిన సింహం.. ఆ తర్వాత వెళ్లిపోయింది. సింహం వెళ్లిపోగానే డ్యాష్ అరవడం మొదలుపెట్టింది. దీంతో సారాలో మరింత ఆందోళన మొదలైంది. ఈ అరుపులతో సింహం మళ్లీ తిరిగి వస్తుందేమో అని సారా భయం.
అయితే అది తిరిగి రాలేదు. ఈ వీడియోను ఆమె ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసి.. చాలా భయమేసిందని రాసుకొచ్చింది. ఈ వీడియోపై నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు. డ్యాష్ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు.
#Lion #Dog #Viral #Facebook