
Leopard Attack

Leopard Attack | ఓ 10 ఏళ్ల చిన్నారిపై చిరుత దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. అయితే ఇదెక్కడో అడవిలో కాదు. జనావాసాల మధ్యలో. పిల్లలంతా చదువుకునే పాఠశాలతో. ఈ సంచలన ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది.
అలీఘర్ జిల్లాలోని ఛర్రా పోలీస్ స్టేషన్ పరిథిలోని చౌధరి నిహాల్ సింగ్ ఇంటర్ కాలేజీ పాఠశాల ప్రాంగణంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

అక్కడి పరిస్థితులను వివరించిన కళాశాల యాజమాన్యం.. పులి ఓ పాఠశాల తరగతిలో దాక్కుందని, ఆ తర్వాత విద్యార్థిపై దాడి చేసిందని తెలిపింది. ఈ దాడిలో విద్యార్థికి గాయాలయ్యాయని, ఆసుపత్రిలో చేర్పించి చికిత్స ఇప్పిస్తున్నామని, కోలుకుంటున్నాడని తెలిపారు.

పాఠశాల సీసీ కెమెరాల్లో క్లాస్ రూంలో దాక్కున్న చిరుతకు సంబంధించిన దృశ్యాలు కనిపించాయి. ఈ ఘటనతో స్థానిక ప్రజలంతా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. విషయం తెలియడంతో భారీగా జనాలు తరలివచ్చారు. కళాశాల పరిథిలో పెద్ద సంఖ్యలో గుమిగూడారు.
#Leopard #Attack #UttarPradesh #Aligarh #Student #CCTVFootage