

Viral Video | ఛత్రపతి సినిమాలో ప్రభాస్ సొరచేపతో ఫైట్ చేసి గెలుస్తాడు గుర్తుందా..! అయితే అది సినిమా. అంతా గ్రాఫిక్స్‌లో సెట్ చేశారు. కానీ దాన్ని సీరియస్‌గా తీసుకున్నాడో ఏమో కానీ అమెరికాకు చెందిన డేవిడ్ షెర్రర్ అనే వ్యక్తి మాత్రం.. ఏకంగా సముద్రంలో దూకి గ్రేట్ వైట్ షార్క్‌తో యుద్ధానికి రెడీ అయ్యాడు.
డేవిడ్ ఓ స్పియర్ ఫిషర్‌మన్. అంటే నీటిలోకి దూకి బల్లెం లాంటి ఆయుధంతో నీటిలోనే చేపలను వేటాడే వాళ్లన్నమాట. నార్త్ కరోలినాకు చెందిన 22ఏళ్ల డేవిడ్ కూడా అదే పని చేస్తుంటాడు. ఈ మధ్య డేవిడ్ అక్కడి సముద్రంలోకి దిగిన వెంటనే.. ఓ గ్రేట్ వైట్ షార్క్ ఎదురైంది. దాంతో డేవిడ్ ఒక్కసారిగా షాకయ్యాడు. అయితే ధైర్యం చేసి చేతిలో ఉన్న స్ఫియర్ సాయంతో షార్క్‌తో ఫైట్ చేయడానికి రెడీ అయ్యాడు. కానీ అదృష్టవశాత్తూ ఆ షార్క్ చేప డేవిడ్‌ని ఏమీ చేయకుండా పక్క నుంచి వెళ్లిపోయింది.
ఈ వీడియోను డేవిడ్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘వామ్మో! ఈ వీడియో చూస్తేనే భయంగా ఉంది. నీకెంత ధైర్యం డేవిడ్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
#GreatWhiteShark #Sphearsman #ViralVideo #America