

Mask | ఈ మధ్య కాలంలో కోవిడ్ దెబ్బకి ఎక్కడికెళ్లినా మాస్క్ పెట్టుకోవాల్సిందే. లేకపోతే భారీ జరిమానాలు కట్టాల్సి ఉంటుంది. ప్రాణాంతకమైన కేయనా బారిన పడే ప్రమాదమూ ఉంటుంది. అందుకే మాస్క్ లేకపోతే షాప్ లు, థియేటర్లు, బస్సులు, ట్రైనలు, విమానాల్లో ఎవ్వరినీ అనుమతించడం లేదు. అయితే కోన్Nఈ సార్లు పక్కన వాళ్ళు మాస్క్ పెట్టుకోకపోతే తోటి ప్రయాణికులు కూడా వాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ తాజాగా డెల్టా ఎయిర్ లైన్స్ లో జరిగిన ఓ ఘటన అందరినీ షాక్ కి గురి చేసింది.
డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో ప్రయాణిస్తున్న ప్యాట్రిసియా కార్న్‌వాల్ అనే మహిళ.. మాస్క్ ధరించలేదని తోటి ప్రయాణికుడైన 80 ఏళ్ల వృద్ధుడిపై దాడి చేసింది. అయితే ఆ సమయంలో ఆయన భోజనం చేస్తున్నాడు. భోజనం చేస్తున్నాడని తెలిసినా.. అతడిపై దాడి చేయడంతో మిగతా ప్రయాణికులు ఆమెకు అర్ధమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించారు. కానీ ఆమె వినకుండా వృద్ధుడిపై బూతులతో విరుచుకు పడుతోంది.
విమాన సిబ్బంది కూడా ఆమెను ఆపేందుకు ప్రయత్నించినఆ ఆమె ఆగలేదు. ఈ క్రమంలోనే ఆమె దాడి చేస్తున్న దృశ్యాన్ని కొందరు ప్రయాణికులు చిత్రీకరించారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే.. ఆ మహిళ స్వయంగా మాస్క్ ధరించలేదు. దీంతో ఆమెతో దెబ్బలు తిన్న వృద్ధుడు కూడా ఆమెను అసభ్య పదజాలంతో తిట్టాడు. ‘ముందు నీ మాస్క్ చూసుకో’ అంటూ బూతులు తిట్టాడు.
కాగా.. విమానం అట్లాంటాలో దిగిన తర్వాత ఫ్లయిట్ సిబ్బంది ఆమెను పోలీసులకు అప్పగించారు. అట్లాంటా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, విమానం అట్లాంటాలో ల్యాండ్ అయిన తర్వాత ప్యాట్రిసియా కార్న్‌వాల్ అనే మహిళను FBI అరెస్టు చేసింది.
ఈ ఘటనపై డెల్టా ఎయిర్ లైన్స్ స్పందిస్తూ.. ప్రయాణికుల నుంచి ఇలాంటి ప్రవర్తనను ఏ మాత్రం సహించమని, కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.
DeltaAirLines #Mask #Atlanta #America