Mutton Lover | నేను కావాలా..? మటన్ కావాలా..?

Mutton Lover

Mutton Lover | ఇదో విచిత్రమైన లవ్ ట్రయాంగిల్. సాధారణంగా లవ్ ట్రయాంగిల్ అంటే ఓ అమ్మాయి-ఇద్దరు అబ్బాయిలు ఉంటారు. లేదంటే ఇద్దరు అమ్మాయిలు-ఓ అబ్బాయి ఉంటారు.
కానీ ఇప్పుడు చెప్పబోయే స్టోరీలో అలా కాదు. ఓ అబ్బాయి- ఓ అమ్మాయి ఉన్నారు కానీ.. మూడో ప్లేస్‌లోనే ఓ మేక ఉంది. ఇదెక్కడి లవ్ ట్రయాంగిల్ అనుకుంటున్నారా..? అయితే ఈ వీడియో చూసి ఫుల్ స్టోరీ తెలుసుకోండి.
అబ్బాయికి ఆ అమ్మాయంటే ఎంతో ఇష్టం. అమ్మాయికి కూడా అంతే. అతడంటే చాలా ప్రేమ. చాలాకాలంగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. వారి ప్రేమ ఫలించింది.

కానీ పెళ్లికి ముందే ఆ అమ్మాయికి సంబంధించిన ఓ నిజం అబ్బాయికి తెలిసింది. అదేంటంటే ఆ అమ్మాయి పేరుకే వెజిటేరియన్ కానీ.. ఆమె మటన్ తింటుంది. ఇంట్లో తెలియకుండా బయట సైలెంట్‌గా మేక మాంసం లాగించేస్తుంది.
ఈ విషయం తెలుసుకున్న అతడు.. మటన్ మానేయాలని కండిషన్ పెట్టి మరీ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లు బాగానే ఉంది. కానీ ఆ తర్వాత అతడికి ఓ నిజం తెలిసింది. ఆమె మటన్ మానేయలేదని. ఆమెను నిలదీశాడు.
అయితే ఆమె..తనకు మటన్ అంతే ఎంతో ఇష్టమని, మానేయలేకపోతున్నానని చెప్పింది. అప్పుడు అతడు.. ‘నేను కావాలో. మటన్ కావాలో తేల్చుకో’ అని హుకుం జారీ చేశాడు.

ఆయితే ఆ తర్వాత అతడిలో అనుమానం కలిగింది ‘ఆమె తనను వదిలేస్తుందో ఏమో’ అని. ఈ విషయాన్ని ఓ పేపర్‌కు రాసి ‘తను నన్ను వదిలేస్తుందంటారా..?’ అని అడగడంతో ఈ విషయం బయటకొచ్చింది.
దీనిపై సదరు పేపర్‌లో ‘మీ లవ్ ట్రయాంగిల్ నిజంగా ఓ రికార్డ్. మనిషికి, మటన్‌కి మధ్యలో అమ్మాయి. వాహ్. ఎవరైనా భోజనాన్నే ఇష్టపడతారు. ఇప్పుడు ఏం జరుగుతుందో ఇక ఆలోచించుకో అని సమాధానం ఇచ్చింది.
దీనికి సంబంధించిన పేపర్ కటింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

నువ్వు వెజిటేరియన్ అయితే ఆమె కూడా కావాలని రూల్ ఎక్కడైనా ఉందా..? నువ్వు పెట్టిన కండిషన్ బుద్ధి లేనిది అని కొంతమంది కామెంట్ చేస్తే.. ఇంకొంతమంది అసలు వెజిటేరియన్ అనేది ఏమీ లేదు.
భ్రమలోఉన్నావ్. నువ్వు తినే చక్కెర(Sugar) కూడా ఆవులు, దూడల ఎముకల పొడితో క్లీన్ చేస్తారు. నువ్వు తినే చాక్లెట్లలో కీటకాల అవశేషాలుంటాయి. వీటన్నింటికీ మన ఎఫ్ఎస్ఏఐ, ఎఫ్‌డీఏలు వెజిటేరియన్ అంటూ ట్యాగ్ ఇస్తున్నాయి.
నీవు తినే వాటిలో చాలా వరకు నీకు తెలియకుండా నాన్ వెజ్ తింటున్నావ్. ఆమెను తినవద్దని ఎలా చెబతావ్..?’ అని ప్రశ్నించారు.
#MuttonLover #Husband #Wife #Vegetarian #Non-Vegetarian #Sugar #Twitter