
Portrait of young woman putting on a protective mask

‘మాస్కులు పెట్టుకోండి లేకపోతే రూ.1000 ఫైన్ విధిస్తాం’ అని తెలంగాణ ప్రభుత్వం చెప్పిన మాటని ప్రజలు చాలా సీరియస్ గా తీసుకున్నారు. అందుకే చాలామంది కచ్చితంగా మాస్క్ పెట్టుకునే బయటకు వస్తున్నారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వీళ్ళలో చాలామంది మూతికి, ముక్కుకే కాకుండా బైక్ లకి కూడా మాస్క్ లు పెడుతున్నారు.
అయితే ఇదేదో సేఫ్టీ కోసం తెచ్చుకున్న అదనపు మాస్క్ కాదు.. పోలీసుల జరిమానాల నుంచి తప్పించుకునేందుకు సెట్ చేసుకున్న స్పెషల్ మాస్క్. ఇలా మాస్కువు వాడేస్తున్న కొందరి ఫోటోలను హైదరాబాద్ సిటీ పోలీసులు క్లిక్ మనిపించారు. వీటిని తమ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో షేర్ చేశారు.
వీళ్ళలో కొంతమంది హెల్మెట్ లేకుండా వెళ్తుంటే.. ఇంకొంతమంది మొఖానికి మాస్కులు లేకుండా ప్రయాణిస్తున్నారు. మరి కొంతమంది సిగ్నల్ బ్రేక్ చేసి వెళుతున్న వాళ్ళు. ఈ ఫోటోలు పోస్ట్ చేసిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్.. “ఈ కొత్త వేరియంట్ రోగులకు సరైన ఐపీసీ సెక్షన్లతో ట్రీట్‌మెంట్ ఇవ్వడం జరుగుతుంది” అని క్యాప్షన్ ఇచ్చింది. ఇప్పుడు ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
అయితే కొందరు పోలీసులు నిబంధనలను ఉల్లంఘిస్తున్న ఫోటోలు, వీడియోలు కూడా కొంతమంది సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. వీటిని పోస్ట్ చేసి ‘వీళ్ళకి రూల్స్ వర్తించవా..?’ అంటూ పోలీసులకు కౌంటర్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.