

Heart surgery | చరిత్రలో తొలిసారి ఓ మనిషికి పంది గుండె అమర్చారు డాక్టర్లు. ఈ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి రికార్డ్ సృష్టించారు. అమెరికాకు చెందిన ఓ వ్యక్తికి ఈ ఆపరేషన్ చేశారు.
అమెరికాలోని మేరీల్యాండ్ కు చెందిన 57 ఏళ్ల డేవిడ్ బెనెట్ టర్మీనల్ హార్ట్ డీసీజ్ తో బాధ పడుతున్నాడు. దీంతో అథాఫై గుండె ఎప్పుడు కొట్టుకుంటుందో, ఎప్పుడు ఆగిపోతుందో తెలియకుండా పోయింది. దీంతో బెనెట్ కి వెంటనే హృదయ మార్పిడి శస్త్రచికిత్స చేయాలని డాక్టర్లు నిర్ణయించారు. కానీ అందుబాటులో అతడికి సరిపోయే హృదయం లేదు. దీంతో జన్యు పరంగా అభివృద్ధి చేసిన ఓ పంది హృదయాన్ని బెనెట్ కి అమర్చారు వైద్యులు. ఈ ఆపరేషన్ ని యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ మెడిసిన్ వైద్య బృందం నిర్వహించింది.
ఇక సోమవారం ఈ శస్త్రచికిత్సకు సంబంధించిన వివరాలను వెల్లడించిన డాక్టర్ల బృందం.. ఆపరేషన్ విజయవంతం అయిందని వెల్లడించింది. ఇలా ఓ వ్యక్తికి పంది గుండె అమర్చడం ఇదే తొలిసారని, అయితే ఈ ఆపరేషన్ విజయవంతం కావడంతో భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి ప్రయోగాలు చేసేందుకు, జంతువుల అవయవాలతో మనుషుల అవయవాల లోటును భర్తీ చేసుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇక శస్త్ర చికిత్స అనంతరం బెనెట్ ప్రస్తుతం పూర్తిఆరోగ్యంతో ఉన్నాడు. బెనెట్ కి సంబంధించిన ఫోటోలను డాక్టర్లు విడుదల చేశారు.
#America #HeartTransplant #PigHeart #Operation