

Doctor eats Cow Dung | హిందువులకు ఎంతో పవిత్రమైన జంతువు ఆవు. అందుకే ఆవును హిందువుల పూజిస్తారు. ఆవు నుంచి వచ్చే పాలు, పెరుగు, నెయ్యితో దేవతలకు అభిషేకాలు కూడా చేస్తారు. ఇక్కడివరకు బాగానే ఉంది. కానీ కొంతమంది ఇంకొంచెం ముందుకెళ్లి.. ‘ఆవు మూత్రంలో కూడా ఔషధ గుణాలున్నాయి. కాబట్టి ఆవు మూత్రాన్ని కూడా తాగితే మంచిది’ అని చెబుతూ ఆవు పోస్తున్నప్పుడే దోసిళ్లు పట్టుకుని గటగటా తాగేస్తుంటారు. అది చూస్తుంటేనే కొద్దిగా వింతగా, అసహ్యంగా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు వీటన్నింటినీ మించిపోయాడో డాక్టర్. మరి అతడిది పిచ్చి అనాలో, లేక మూఢనమ్మకం అనాలో తెలియదు కానీ.. ఏకంగా ఆవు పేడను కరకరా నమిలి తినేస్తున్నాడా మహానుభావుడు.
హర్యానాకు చెందిన ఈ డాక్టర్ పేరు మనోజ్ మిట్టల్. ‘ఆవు మూపురంలో బంగారం ఉంటుంది. ఆ బంగారం దాని కడుపులోకి చేరి పేడ ద్వారా బయటికి వస్తుంది. అందువల్ల ఆ పేడను తింటే మన శరీరంతో పాటు ఆత్మ కూడా పరిశుద్ధం అవుతుంది’ అని చెబుతూ ఆవు పేడను ముద్దలు చేసుకుని గుటుక్కుమనిపిస్తున్నాడు. అంతేకాదు.. ఇంత గొప్ప ఆవును మన జాతీయ జంతువు చేయాలని డిమాండ్ కూడా చేస్తున్నాడు.
ఇక ఈ వీడియో చూసిన అనేకమంది నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. భారతదేశం ఆకలి తీర్చే మార్గం చెప్పాడని, ఈయనను మన జాతీయ ఆహార శాఖ అధికారికగా పెడితే.. ఇప్పుడు హంగర్ ఇండెక్స్‌లో దిగజారిన మన దేశం.. త్వరలో ఆకలి అనేదే లేని దేశంగా మారుతుందని సలహా ఇస్తున్నారు. ఇంకొంతమందేమో.. ‘ఈ డాక్టర్ చెప్పేదాన్ని బట్టి చూస్తే.. బాత్‌రూంలు కడిగే హర్పిక్‌తో కళ్ల వ్యాధులను తగ్గించుకోవచ్చనిపిస్తోంది. ఏమంటారు..?’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

https://twitter.com/ColdCigar/status/1460301443332644869?s=20
https://twitter.com/indian_armada/status/1459447842146193416?s=20