

Devils Falls | డెవిల్స్ కెటిల్ ఫాల్స్.. పేరుకు తగ్గట్లే ఈ జలపాతం దెయ్యాల లోకానికి వెళుతుందని చాలామంది స్థానికులు నమ్మతారు. ఈ జలపాతం అన్ని జలపాతాల్లానే ఉన్నా.. ఓ చిన్న విషయం దీనిని ప్రత్యేకంగా మారుస్తుంది.
అదేంటంటే.. ఈ జలపాతం దగ్గర నీళ్లు రెండు పాయలుగా కిందకు పడతాయి.
అయితే వాటిలో ఓ పాయ బయటకు కనిపిస్తూ నేలపై పడుతుంది. కానీ రెండో భాగం మాత్రం ఓ చిన్న కందకం అంటే ఓ Whole లోకి వెళ్లిపోతోంది.
కానీ అలా వెళుతున్న నీళ్లు ఎటు వెళుతున్నాయో, ఏమైపోతున్నాయో సైంటిస్టులకు కూడా అంతుపట్టడం లేదు.
ఆ నీళ్లు ఎటు వెళుతున్నాయో కనిపెట్టేందుకు ఈ రంథ్రంలోకి వస్తువులను వేశారు. రంగు నీళ్లు పోశారు. కెమెరాలను కూడా వదిలిపెట్టారు.
కానీ వాటిల్లో ఏ ఒక్కటీ ఎక్కడా బయటకు రాలేదు. దీంతో ఈ రంథ్రం మిస్టరీ నేటికీ రహస్యంగానే మిగిలిపోయింది.
డెవిల్స్ కెటిల్ ఫాల్స్. అమెరికాలోని మిన్నెసోటాలో ఉంటుంది. అక్కడి సుపీరియర్ సరస్సు పైభాగంలో 800 అడుగుల ఎత్తులో ఈ డెవిల్స్ కెటిల్ ఫాల్స్ ఉంటుంది.
ఓ భాగం నేరుగా కింద సరస్సులో కలిస్తే.. రెండో భాగం మాత్రం మధ్యలోనే ఓ సరస్సులోకి వెళ్లిపోతుంది. ప్రపంచంలోనే ఇలాంటి విచిత్రమైన, రహస్యాలతో నిండిన జలపాతం ఇంకొకటి లేనేలేదు.

ఈ సరస్సులో నీళ్లు ఎటు వెళుతున్నాయో అర్థం కాక శాస్త్రవేత్తలు కూడా తలలు పట్టుకున్నారు. కొంత మంది ఈ రంథ్రంలోకి పింగ్ పాంగ్ బాల్స్ వేశారు.
బాల్ దొరికితే కాల్ చేయాలంటూ ఓ నెంబర్‌ను కూడా వాటిపై వాళ్ల ఫోన్ నెంబర్ రాసి ఆ రంథ్రంలో విసిరేసేవాళ్లు. కానీ ఫలితం లేదు. ఇంకొంతమంది రంగు నీళ్లు పోశారు.
అవి ఎక్కడైనా బయటకు వస్తాయేమో అని. కానీ ప్రయోజనం లేకపోయింది. ఇంకొంతమంది ఏకంగా కెమెరాలను కూడా లోపలికి వదిలినట్లు కూడా కథలున్నాయి.
అయితే ఇంత చేసినా ఆ నీళ్లు ఎటు వెళతున్నాయో ఎవ్వరికీ అర్థం కాలేదు.
దీంతో ఈ రంథ్రం అవతలి వైపు వేరే లోకం ఉందని, ఆ లోకానికే ఈ నీళ్లు వెళుతున్నాయని కొంతమంది పుకార్లు కూడా పుట్టించారు.
అయితే 2016లో శాస్త్రవేత్తలు.. ఇక్కడి శిలలపై పరిశోధన చేసి ఓ అంచనాకొచ్చారు.
అదేంటంటే.. ఇక్కడున్న రాళ్లను బట్టి చూస్తే లోపల సొరంగాలు ఉండే అవకాశం కానీ, భూగర్భ ప్రవాహాలు ఉండే అవకాశం కానీ లేదని తేల్చారు.
అలాగే ఈ రంథ్రంలోకి వెళుతున్న నీళ్లు మళ్లీ ప్రవాహం అడుగున సస్సులోనే కలిసిపోతుందని నిర్ధారించారు.
అలాగే ఈ రంథ్రంలో నీటి ఒత్తిడి ఎక్కువగా ఉండడంతో ఇందులో వేసిన వస్తువులన్నీ లోపలే పగిలిపోయి ఉంటాయని అంచనా వేశారు.
కానీ శాస్త్రవేత్తలు చెప్పిన ఈ మాట స్థానికులతో పాటు ఆ జలపాతం ఉన్న స్టేట్ పార్క్ యాజమాన్యం కూడా అంగీకరించడం లేదు.
#DevilsKettleFalls #Mystery #America