Warning: sprintf(): Too few arguments in /home/ff4q68c69pqk/public_html/wp-content/themes/covernews/lib/breadcrumb-trail/inc/breadcrumbs.php on line 253

Booster Dose | బూస్టర్ డోస్‌తో ఒమిక్రాన్‌కు చెక్..?

Omicron

Omicron

Booster Dose | ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న అంశం ‘ఒమిక్రాన్’. ఈ వేరియంట్ ఇప్పటికే పలుదేశాలకు పాకింది. దీంతో ఆయా దేశాలు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలని హెచ్చరికలు చేస్తున్నాయి.

వీటిలో భారతదేశం కూడా ఒకటి. ఇలాంటి సమయంలో ఫైజర్ టీకా.. ఒమిక్రాన్ వేరియంట్‌పై కూడా పనిచేస్తోందని ఆ కంపెనీ ప్రకటించింది. ఫైజర్-బయాన్‌టెక్ సంస్థలు రెండూ కలిసి ఈ వ్యాక్సిన్ తయారుచేసిన సంగతి తెలిసిందే. ఈ కంపెనీలు తాజాగా ఒక జాయింట్ ప్రకటన చేశాయి.

Omicron

ప్రాథమిక పరిశోధనల్లో తమ వ్యాక్సిన్ మూడో డోసు ఒమిక్రాన్‌ను కూడా నిలువరిస్తున్నట్లు ఈ కంపెనీలు వెల్లడించాయి.

‘రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారితో పోలిస్తే.. మూడో డోసు తీసుకున్న వారి శరీరంలో యాంటీబాడీలు 25 రెట్లు వృద్ధి చెందుతున్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి’ అని ఈ రెండు కంపెనీలు వివరించాయి. ఇవి ఒమిక్రాన్ మీద ప్రభావం చూపుతాయని పేర్కొన్నాయి.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *