

Dinosaur | భూమిపై పుట్టిన అతి పురాతన జీవుల్లో డైనోసార్స్ కూడా ఉంటాయి. వీటి అవశేషాలు, వీటి గురించి చెప్పిన కథలే తప్ప మరేమీ మనకు తెలీదు. వీటికి సంబంధించి ఏ చిన్న విషయం తెలిసినా ఎంతో ఆసక్తిగా చూస్తాం. అందుకే వీటి గురించి పరిశోధకులు నిరంతరం అన్వేషిస్తుంటారు.
ఇప్పటి వరకు డైనోసార్ ఎముకలు, పళ్లు తప్పా మరేమీ మనకు దొరకలేదు. వాటిని బట్టే అనేక రకాల డైనోసార్ జాతులను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అయితే తాజాగా శాత్రవేత్తలకు డైనోసార్ గుడ్డు శిలాజాలు దొరికాయి. ఇందులో డైనోసార్ పిల్ల దాదాపు బయటకు వచ్చేందుక సిద్ధంగా ఉంది.
ఈ బేబీ డైనోసార్ పిండం శాస్త్రవేత్తలకు దక్షిణ చైనాలోని గంజౌ ప్రాంతంలో లభ్యమైంది. శాస్త్రవేత్తలు చెప్పిన వివరాల ప్రకారం.. ఆ డైనోసర్ గుడ్డు దాదాపు 66 మిలియన్ సంవత్సరాల క్రితందిగా తెలిపారు. అంటే దాదాపు 6.6 కోట్ల ఏళ్ల క్రితం నాటిది.
అంతేకాకుండా ఇది దంతాలు లేని థెరోపాడ్ డైనోసార్ లేదా ఓవిరాప్టోరోసార్ అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కాగా దీనికి ‘బేబీ యింగ్‌లియాంగ్’ అని పేరు పెట్టారు. ఈ శిలాజాలపై ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయని, మరిన్ని విషయాలు త్వరలో వెల్లడిస్తామని వారు తెలిపారు.
https://twitter.com/news_ub/status/1473333313549094912?s=20
#BabyDinosaur #FossilisedEgg #Scientists #China