

Omicron | గతేడాది కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఆనందయ్య బాగా పాపులర్ అయ్యారు. కోవిడ్ మందంటూ ఆయన ఉచితంగా మందు అందించడంతో దేశం మొత్తం గుర్తింపు లభించింది. ఆయన మందుకోసం కృష్ణపట్నంలో వేలమంది జనాలు క్యూ కట్టారు. అయితే దీనిపై కొంతమంది కోర్టులకెక్కడంతో పంపిణీ ఆగిపోయింది. కానీ కోర్టు కూడా ఆయన ఔషధానికి ఓకే చెప్పడంతో మళ్లీ పంపిణీ మొదలైంది. ఆ తర్వాత కోవిడ్ ప్రభావం తగ్గడంతో ఆనందయ్య ప్రాభవం కొద్దిగా తగ్గింది. అయితే ఇప్పుడు ఆనందయ్య మళ్లీ వార్తల్లోకెక్కారు.

కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసింది. ఆఫ్రికాలో పుట్టిన ఈ వేరియంట్ ఇప్పటివరకు కనిపెట్టిన వాటన్నింటికంటే 30శాతం వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించడం.. ఇప్పటికే ఇంగ్లండ్, అమెరికా, చైనాలతో పాటు భారత్ కూడా ఈ వేరియంట్ పాకడంతో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఇలాంటి టైంలో ఆనందయ్య మళ్లీ తెరమీదకొచ్చారు. తాను ఒమిక్రాన్‌కు కూడా మందు కనిపెట్టానని సంచలన ప్రకటన చేశారు.

తాజాగా ఒమిక్రాన్ వేరియంట్‌పై స్పందించిన ఆనందయ్య.. ‘ఒమిక్రాన్‌కు కూడా మందు తయారు చేశాను. ఎవరికైనా అవసరమైతే ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను. ఈ మందుతో కేవలం 48 గంటల్లోనే ఒమిక్రాన్ పూర్తిగా నయమైపోతుంది. ఒమిక్రాన్ సోకిన వారుగానీ, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారి బంధువులుగానీ సంప్రదిస్తే ఉచితంగానే మందు ఇస్తాను’ అని ఆనందయ్య చెప్పడం ఇప్పుడు సెన్సేషన్ అవుతోంది. అంతే కాదు.. ఎన్నివేలమందికి ఒమిక్రాన్ సోకినా మందు ఇవ్వడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసినట్లు ఆనందయ్య చెప్పారు
#Anandaiah #Covid #Omicron #Medicine