Naiki Devi | ఘోరీకి చావు భయం పరిచయం చేసిన రాణి

Naiki Devi | భారతీయులను ఊచకోత కోసిన ఇస్లామిక్ సుల్తాన్.. మహ్మద్ షహాబుద్దీన్ ఘోరీ. వాడి క్రూరత్వం గురించి ప్రత్యేకంగా

Spread the love
Naiki Devi

Naiki Devi

Naiki Devi | భారతీయులను ఊచకోత కోసిన ఇస్లామిక్ సుల్తాన్.. మహ్మద్ షహాబుద్దీన్ ఘోరీ. వాడి క్రూరత్వం గురించి ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు.

ఎన్నో రాజ్యాలను ధ్వంసం చేసి తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. ఎంతో సంపద దోచుకున్నాడు.

స్త్రీలను చెరబట్టి క్రూరంగా అనుభవించేవాడు. అలాంటి దుర్మార్గమైన ఘోరీని ప్రాణభయంతో పారిపోయేలా చేసిన మహారాణి నాయకి దేవి. ఆమె దెబ్బకు ఘోరీ యుద్ధాన్ని మధ్యలోనే వదిలి పారిపోయాడు.

దేశాన్నే వణికించిన ఓ సుల్తాన్‌ని, ఎంతోమంది స్త్రీల మానాన్ని దోచుకున్న ఓ మృగాన్ని తన కత్తి పదునుతో వణికించిన వీరనారి నాయకి దేవి. భారతీయ స్త్రీల వీరత్వాన్ని చాటి చెప్పే ఆమె కథ ఇప్పుడు తెలుసుకుందాం.

గుజరాత్‌పై ఘోరీ కన్ను:

అలెగ్జాండర్, అరబ్బులు, పర్షియన్లు, మహ్మద్ ఘజిని… ఇలా ఎంతో భారతదేశాన్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నించి విఫలమయ్యారు.

కానీ వాళ్లెవ్వరికీ సాధ్యం కాని దానిని 12వ శతాబ్దంలో మహ్మద్ ఘోరీ చేసి చూపించాడు.

భారత్‌లో పాకిస్తాన్ వైపు నుంచి ఒక్కో రాజును ఓడించుకుంటూ భారతదేశం మధ్య వరకు వచ్చేశాడు. అతి పెద్ద సుల్తాన్ ముల్తాన్‌ను కూడా ఓడించి అతడి సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు.

అలా రాజులను ఓడిస్తూ, రాజ్యాలను స్వాధీనం చేసుకుంటూ వస్తున్న సమయంలోనే ఘోరీ కన్ను గుజరాత్‌పై పడింది.

గుజరాత్‌లోని అప్పుడు చాళుక్య యువరాజు రెండో ములరాజు రాజుగా ఉన్నాడు. అతడి తండ్రి అజయపాలుడు మరణించడంతో చిన్నతనంలోనే రాజు కావల్సి వచ్చింది. ములరాజుకు అండగా అతడి తల్లి నాయకి దేవి ఉండేవారు.

రాజ్యంలోని అన్ని కార్యకలాపాలను ఆమే చూసుకునేవారు. ఈ విషయం తెలిసిన ఘోరీ.. తన సైన్యాన్ని చాళుక్య రాజ్యం రాజధాని అన్హిల్వరా(Anhilwara) వైపు మళ్లించాడు.

ఓ భర్తలేని స్త్రీ, చిన్న పిల్లాడు తననేం చేయలేరని, ఆ రాజ్యాన్ని సులభంగా హస్తగతం చేసుకోవచ్చని అనుకున్నాడు ఘోరీ.

కానీ అతడికేం తెలుసు.. తన జీవితంలో అతి మర్చిపోలేని తప్పు చేయబోతున్నానని.

యుద్ధానికి నాయకీ దేవి సిద్ధం:

ఘోరీ దాడి చేయబోతున్నాడని తెలియడంతో నాయకి దేవి( Naiki Devi) యుద్ధానికి సిద్ధమయ్యారు.

ఘోరీ ఎలాంటి వాడో, అతడి సైన్యం శక్తి ఏంటో, తనకంటే పెద్ద రాజ్యాలను సైతం అతడు ఎలా నాశనం చేశాడో నాయకీ దేవికి తెలియంది కాదు.

అయితే ఆమె యుద్ధానికే సిద్ధమయ్యారు. నాయకి దేవి కూడా అప్పటి కదంబరాజ్యం గోవా రాజు పరమార్దిన్ కుమార్తె కావడం.

దీంతో ఆమె కూడా చిన్నప్పటి నుంచి యుద్ధ కళలు నేర్చుకున్నారు. ఖడ్గ విద్యలో ఎంతో నైపుణ్యం సాధించారు.

అందుకే కదనరంగంలోకి ఆమే స్వయంగా దిగారు. తనకు సాయం చేయాలని చుట్టుపక్కల రాజులను కోరారు. అందులో పృధ్వీరాజ్ చౌహాన్ కూడా ఉన్నారు. కానీ వాళ్లెవ్వరూ ఆమెకు సాయం చేయడానికి ఆసక్తి చూపించలేదు.

కొంతమంది మాత్రం ఆమెకు ఆర్థికంగా సాయం చేశారు. అయితే నాయకీ దేవికి తెలుసు.. ఈ బలంతో ఘోరీని ఓడించలేమని.

అందుకే తెలివిగా యుద్ధ తంత్రాన్ని సిద్ధం చేశారు నాయకీ దేవి. రణభూమిని గాదర్‌ఘాట్‌కు మార్చారు.

మౌంట్ అబు కింద ఉండే ఈ ప్రాంతం ఎత్తుపల్లాలుగా ఉంటుంది. ఇలాంటి ప్రాంతంలో ఘోరీసైన్యం ఎప్పుడూ యుద్ధం చేసింది లేదు. కానీ నాయకీ దేవి సైన్యానికి ఇలాంటి ప్రాంతాలు బాగా అలవాటు.

ఈ విషయం తెలియని ఘోరీ.. గాదర్‌ఘాట్‌లో యుద్ధానికి సరే అన్నాడు. అక్కడే ఆమె మాస్టర్ ప్లాన్ పనిచేసింది.

పారిపోయిన ఘోరీ:

యుద్ధం చేయాల్సిన రోజు రానే వచ్చింది. యుద్ధ భూమిలో అడుగుపెట్టిన తర్వాత ఘోరీకి అర్థమైంది ఎంత పెద్ద తప్పు చేశాడో. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది.

లక్షలమంది ఘోరీ సైన్యాన్ని కేవలం వేల మంది సైన్యంతో ఎదుర్కోవడమే కాకుండా.. ఊచ కోత కోయడం మొదలెట్టారు నాయకీ దేవి.

యుద్ధపుటేనుగుల కాళ్ల కింద వందలమంది ఘోరీ సైనికులు పడి ప్రాణాలు కోల్పోయారు. అప్పుడే ఘోరీ-నాయకీ దేవి ఎదురుపడ్డారు.

నాయకీ దేవి ఘోరీపైకి తన ఖడ్గంతో దాడి చేసింది. అదే సమయంలో ఓ సైనికుడు ఆమెను వెనుక నుంచి దాడి చేయడంతో ఆమె గురి తప్పింది.

ఘోరీ తల తెగి నేలమీద పడాల్సిన వేటు.. కొద్దిగా పక్కకు జరిగి ఘోరీ నడుము భాగంలో తగిలింది. ఆ దెబ్బతో ఘోరీకి భయం మొదలైంది. అంతే కొంతమంది సైనికులతో అక్కడి నుంచి పారిపోయాడు.

1173లో అలా ఓ భారతీయ వీరవనిత దెబ్బకు ప్రాణాలు కాపాడుకుని పారిపోయిన ఘోరీ.. ఆ తర్వాత రెండు దశాబ్దాలకు 1193లో పృధ్వీరాజును ఓడించి భారతదేశంలో తన సామ్రాజ్యాన్ని స్థాపించాడు.

అయితే ఆ యుద్దంలో నాయకీదేవి మణించారా..? లేదా..? విషయం ఎక్కడా లేదు. అంతటి వీరవనిత కథ కాలగర్భంలో కనుమరుగైపోయింది.

కానీ గుజరాత్‌లో ఉన్న చోళుల రాతి ఫలకాల్లో మాత్రం నాయకీ దేవి గరించి, ఆమె బిడ్డ రెండో ములరాజు గురించి, ఘోరీని ఓడించిన ఘనత గురించి ముద్రించబడి ఉంటుంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *