

American Airlines | రోజూ ఎంతోమంది అమెరికాకు అక్రమంగా వస్తుంటారు. శనివారం కూడా ఓ వ్యక్తి అలాగే అమెరికాకు వచ్చాడు. కానీ అతడు వచ్చిన విధానం ఎయిర్‌పోర్ట్ అధికారులకు మతి పోగొట్టింది. గ్వాటెమాలా నుంచి మియామీకి అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం ఒకటి శనివారం వచ్చింది. మొత్తం రెండున్నర గంటలు ప్రయాణం చేసి 1640 కిలోమీటర్ల దూరం చేరుకుంది.
విమానం మియామీ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అవగానే ప్రయాణికులంతా ఒక్కొక్కరుగా దిగుతున్నారు. ఈ సమయంలోనే ఓ వ్యక్తి విమానంలో నుంచి దిగాడు. అయితే అందరిలా ప్యాసెంజర్ ప్లేస్ నుంచి కాకుండా.. విమానం కాక్‌పిట్ నుంచి బయటకొచ్చాడు. ఇది చూసిన అధికారులు ఆశ్చర్యపోయారు. అతడిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఓ మీడియా సంస్థ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళితే.. గ్వాటెమాలా సిటీ నుంచి మియామికి రావాలంటే దాదాపు 1,640 కిలోమీటర్లు ప్రయాణించాలి. అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో రెండున్నర గంటల ప్రయాణం. అయితే అన్ని గంటల పాటు ఆ వ్యక్తి విమానం టైర్ల పక్కన ఉండే ల్యాండింగ్ గేర్‌లోనే ఇరుక్కుని ఉన్నాడు. దీంతో విమానం ల్యాండ్ అయిన తర్వాత కిందకు దిగిన అతడి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అతడు బయటకు వచ్చినప్పటి నుంచి మొత్తం దృశ్యాలను ఎయిర్‌లైన్స్ సిబ్బంది రికార్డ్ చేశారు.
అయితే ఈ ఘటనలో ఆ వ్యక్తికి గాయాలేమీ పెద్దగా కాలేదని తెలుస్తోంది. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి పంపించారు. అయితే ఈ ఘటనపై స్పందించేందుకు పోలీసులు నిరాకరించారు. దీనిపై అధికారులు దర్యాప్తు చేపట్టినట్లు మాత్రం చెబుతున్నారు. కానీ వారుతీసిన వీడియో మాత్రం బయటకొచ్చేసింది. దీంతో ఓ మీడియా సంస్థ ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.
2 thoughts on “American Airlines | 2:30 గంటలు.. 1640 కిలోమీటర్లు.. వామ్మో వీడి తెలివి పాడుగానూ!”