Traffic Rules | పోలీసులకు రూల్స్ లేవా..? నిలదీసిన మహిళ


Traffic Rules | ట్రాఫిక్ రూల్స్ పాటించని మహిళా పోలీసులకు ఓ మహిళ చుక్కలు చూపించింది. ట్రాఫిక్ రూల్స్ సామాన్యులకేనా..? పోలీసులకు లేవా..? అంటూ నడిరోడ్డుపై నిలదీసింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. కర్ణాటకలో ఈ ఘటన జరిగింది.
దర్జాగా రూల్స్ ఏమీ పట్టించుకోకుండా వెళుతుంటారు. వాళ్లని ఎవరూ ఏమీ అనరని ధీమా వాళ్లది. కానీ అలాంటి కొంతమంది మహిళా పోలీసులకు ఓ మహిళ అనుకోని షాకిచ్చింది. హెల్మెట్లు లేకుండా వెళుతున్న, ట్రిపుల్ రైడ్ చేస్తున్న కొంతమందిని నడిరోడ్డుపై ఆమె నిలదీసింది. ‘ట్రిపుల్స్ ఎలా వెళతారు..? హెల్మ్‌ట్ లేకుండా ఎలా బైక్ నడుపుతారు..? ఇలా ప్రవర్తించి ప్రజలకు ఏం మెసేజ్ ఇద్దామని అనుకుంటున్నారు..?’ అని ప్రశ్నించిందామె. దీంతో ఆ పోలీసులు సైలెంట్‌గా బైక్ దిగి నడుచుకుంటూ వెళ్లిపోయారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు వీడియో తీసిన మహిళను ప్రశంసిస్తూనే.. పోలీసులను తెగ ట్రోల్ చేస్తున్నారు. హెల్మెట్ పెట్టుకోకపోతే ఫైన్. ట్రిపుల్ రైడ్ చేస్తే ఫైన్. రాంగ్ రూట్లో మీటరు దూరం వెళ్లినా ఫైన్. ఈ రూల్స్ అన్నీ ప్రతి ఒక్కరికీ వర్తిస్తాయి. ఎవరు అతిక్రమించినా కచ్చితంగా ఫైన్ కట్టాల్సిందే. కానీ ఇలాంటి పోలీసులకు మాత్రం ఈ రూల్స్ పట్టవు. వీళ్లు కూడా రూల్స్ పాటించేలా చట్టాలు తేవాలి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
1 thought on “Traffic Rules | పోలీసులకు రూల్స్ లేవా..? నిలదీసిన మహిళ”