

ప్రపంచంలోని అనేక మందికి ఇష్టమైన వంటకాల్లో పరాటా కచ్ఛితంగా ఉంటుంది. కానీ చాలా మందికి దీన్ని వండివార్చడం రాదు. కొందరికి వచ్చినా అంత బాగా రాదు. వాళ్లని అడిగితే పరాటా కాల్చడం అంటే తేలికనుకుంటున్నావా అని మనపై ఎదురుదాడి చేస్తారు. అయితే ప్రస్తుతం నెట్టింట ఓ 9 ఏళ్ల కుర్రాడు పరాటా చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. తొమ్మిదేళ్లకే ఎక్స్‌పర్ట్ చెఫ్‌లా పరోటా భలే తప్పేస్తున్నాడు. ఈ బుడతడి ప్రతిభకు నెటిజన్స్ ఫిదా అయిపోయారు. ఫరిదాబాద్‌కు చెందిన ఈ కుర్రాడు తనదైన స్టైల్‌లో పరాటా తిప్పుతూ కస్టమర్స్‌ను ఆకట్టుకుంటున్నాడు.
ఇది కూడా చదవండి: Instagram | సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బెల్లీ బ్యూటీ.. వీడియో వైరల్..
ఇక రుచి విషయానికొస్తే.. కుర్రాడు పరాటా చేస్తుంటేనే నోరూరిపోతుంది అని అక్కడి కస్టమర్లు చెబుతుంటారు. కొందరైతే బుడతడి చేతుల్లో మ్యాజిక్ ఉందని కితాబిస్తున్నారు. దీంతో పాటుగా సోషల్ మీడియాలో కుర్రాడి వీడియో చూసిన వారిలో చాలా మంది.. తమకుంటే ఈ పిల్లాడే పరాటా బాగా, రుచికరంగా చేస్తున్నాడని ఒప్పుకుంటున్నారు. కొందరు మాత్రం పిల్లాడి పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆ వయసులో ఆ పిల్లాడు బడిలో ఉండాలని, వీధిలో పరాటాలు అమ్ముకోకూడదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.