Sun | సూర్యుడు చల్లబడ్డాడు?.. వెల్లడించిన భారత శాస్త్రవేత్తలు..

Sun | సూర్యుడు.. అనగానే మనందరికీ మండే అగ్నిగోళం, నిత్యం భగభగ మండే నక్షత్రం గుర్తుకొస్తుంది. తనలో తను అంతలా మండుతూ

Spread the love
Sun

Sun | సూర్యుడు.. అనగానే మనందరికీ మండే అగ్నిగోళం, నిత్యం భగభగ మండే నక్షత్రం గుర్తుకొస్తుంది. తనలో తను అంతలా మండుతూ ప్రపంచానికి వెలుగులు పంచే సూర్యుడిపై నిత్యం ప్రపంచ దేశాలు అనేక పరిశోధనలు చేస్తుంటాయి. ఈ దేశాల్లో మన భారత్ కూడా ఒకటి.

అయితే తాజాగా భారత శాస్త్రవేత్తలు సూర్యుని గురించి షాకింగ్ విషయాలు వెల్లడించారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (IIA) వెల్లడించి నివేదిక ప్రకారం.. సూర్యుడు చల్లబడ్డాడంట. ఇది వరకటి సూర్యుడిలా లేడంట.

1996-2007 మధ్య కాలం సూర్యుడిని 2008-19 కాలం సూర్యుడిని పోలిస్తే చాలా మార్పు వచ్చిందని వారు అంటున్నారు. 1996-2007 కాలం నాటి సూర్యుడు మనందరికీ తెలిసిన అగ్నిగోళం. కానీ 2008-19 కాలం సూర్యుడు అలా కాదట. అంతకుముందు కన్నా చల్లబడ్డాడట.

ఈ సమయంలో సూర్యుడిపై కరోనల్ మాస్ ఎజెక్షన్స్ (CME) పరిమాణం, ద్రవ్యరాశి మరియు అంతర్గత ఒత్తిడి గణనీయంగా తగ్గిందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

సీఎమ్‌ఈ అంటే భారీ సౌర కణాల కారణంగా సూర్యునిపై జరిగే విస్పోటనాలు. ఇవి తగ్గడంతో ఈ సమయంలో సూర్యుడు మునపటికన్నా చల్లగా ఉన్నాడని శాస్త్రవేత్తలు తెలిపారు.
#Sun #SolarSystem #Scientists #India #CME #IIA

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *