Viral Villages | ప్రపంచంలోనే వింతైన గ్రామాలు

Viral Villages

Viral Villages

Viral Villages

Viral Villages | ప్రపంచంలో ఎన్నో వింతలున్నాయి. వాటిలో మనం కొన్ని కనిపెట్టి.. ఎంతో తెలుసుకున్నాం అనుకుంటాం. కానీ ఇప్పటికీ మనకు తెలియని వింతలు ఎన్నో మన చుట్టూ ఉన్నాయి. ముఖ్యంగా మన ఇండియాలో ఇలాంటి వింతలు ఎన్నో. కొన్ని చోట్ల ఏకంగా గ్రామాలకు గ్రామాలే ఈ వింతలకు నిలయంగా ఉన్నాయి. అలాంటి గ్రామాల గురించే ఈ వీడియో చూద్దాం.

అంతా బాగుందిలే అనుకునేలోపే మతి పోగొట్టే వింతలు మనకు ప్రత్యక్షమవుతాయి. ఆ వింతలు చూసి ఆశ్చర్యపోవాలో, వాటిని అర్థం చేసుకోలేక నిర్థాంతపోవాలో కూడా అర్థం కాదు. ఇప్పుడు చెప్పబోయే గ్రామాలు సరిగ్గా అలాంటివే.

గుడ్డోళ్ల ఊరు టిల్టెపే గ్రామం:

Viral Villages

మెక్సికోలో ఈ టిల్టెపే గ్రామం ఉంది. ఇక్కడ మనుషులంతా గుడ్డివాళ్లే. మనుషులే జంతువులు కూడా గుడ్డివే. అయితే విచిత్రం ఏంటంటే ఇక్కడ పుట్టినప్పుడు జంతువులు, మనుషులకు కళ్లు బాగానే కనిపిస్తాయి. కానీ కొన్నాళ్లకే ఆ చూపు పోతుంది. మీడియా రిపోర్టుల ప్రకారం.. ఈ గ్రామంలో జోపోటే జాతి ప్రజలు నివశిస్తారు. మొత్తం గ్రామంలో 300 మంది వరకు ఉంటారు. వీళ్లలో 90 శాతం గుడ్డివాళ్లే.


వీళ్లంతా తమను గుడ్డి వాళ్లని చేసింది లాల్ జువెలా చెట్టేనని నమ్ముతారు. ఆ చెట్టు శాపించబడిన చెట్టని, ఈ చెట్టును చూడడం వల్లే ఇలా గుడ్డితనం వస్తోందని నమ్ముతారు. అయితే ఇక్కడ పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు మాత్రం ఈ అంధత్వం వెనుక ఓ విషపూరితమైన ఈగ జాతికి చెందిన పురుగు కారణమని చెబుతున్నారు. ఆ పురుగు కుట్టడం వల్లే వీరంతా గుడ్డివాళ్లుగా మారిపోతున్నారని అంటున్నారు.

అలెగ్జాండ‌ర్ వారసుల ఊరు మలానా గ్రామం:

Viral Villages

ఈ గ్రామం భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్‌లో ఉంది ఈ మలానా గ్రామం. ఇక్కడ విచిత్రం ఏంటంటే వీళ్లంతా అలెగ్జాండర్ వారసులమని చెప్పుకుంటారు. అలెగ్జాండర్ భారత్‌పై దాడి చేసినప్పుడు.. వాళ్లలో కొంతమంది సైనికులు మలానా గ్రామంలో ఉండిపోయారు. వాళ్ల వంశాలే తామని ఇక్కడి ప్రజల నమ్మకం. దీనికి ఆధారంగా అలెగ్జాండర్ సమయం నాటి కొన్ని ఆయుధాలు కూడా వీళ్ల దగ్గర ఉన్నాయి.

ఇక్కడి ప్రజలు మాట్లాడే భాష కూడా రహస్యమే. ఆ భాష పేరు కనాషీ. ఇక్కడి ప్రజలు తప్ప ప్రపంచంలో ఇంకెక్కడా మాట్లాడరు. ఈ విషయంలోనే ప్రస్తుతం శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. వీళ్లకు ప్రత్యేకంగా ఓ చట్టం కూడా ఉంది. ఆ చట్టం ప్రకారమే తప్పు చేసిన వాళ్లకి శిక్షలు కూడా ఉంటాయి.

అంతేకాదు..ఈ గ్రామంలోని ప్రజలు బయటి వ్యక్తులను ముట్టుకోరు. అలాగే వాళ్లని ముట్టుకోవడానికి కూడా ఇష్టపడరు. కాదని ఏదైనా ముట్టుకున్నా.. ఎవరినైనా తాకినా 1000 నుంచి రూ.5వేల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

దెయ్యాల గ్రామం బేనాగ్రామం:

Viral Villages

ఈ గ్రామాన్ని దెయ్యాల గ్రామం అని కూడా అంటారు. ఈ గ్రామం పశ్చిమ బెంగాల్‌లో అస్సాం సోల్ జిల్లాలో ఉన్న ఓ గ్రామం. ఈ గ్రామానికి వెళ్లాలంటేనే చుట్టుపక్కల వాళ్లు భయపడిపోతారు. ఈ గ్రామం ఇప్పుడు పూర్తిగా ఖాళీ అయిపోయింది. అయితే ఈ గ్రామంలో కూడా ఒకప్పుడు జనాలు బాగా నిశించేవాళ్లు. అయితే పట్టణానికి దూరంగా ఉండడంతో దొంగలు, దోపిడీదారుల కన్ను ఈ గ్రామంపై పడింది.

వాళ్లు ఎవరినైనా చంపితే ఆ శవాలను తెచ్చి ఇక్కడ పడేసేవారు. ఒక సమయంలో గ్రామంలోని రైల్వే ట్రాక్‌పై ప్రతి రోజూ ఏదో ఓ శవం కనిపిస్తూ ఉండేది. దీంతో ఇక్కడ నివశించే వారిలో భయం మొదలైంది. దానికి తోడు కొంతమందికి ఆత్మలు కనిపిస్తున్నాయంటూ పుకార్లు మొదలు కావడంతో జనాలు భయంతో ఊరినే ఖాళీ చేసి వెళ్లిపోయారు.

మరిగుజ్జుల గ్రామం మాఖునిక్:

Viral Villages

ఇది ఇరాన్‌లో ఉంది. అయితే నిజానికి ఇది అటు ఆఫ్ఘనిస్తాన్, ఇటు ఇరాన్‌కు మధ్యలో సరిగ్గా రెండు దేశాలకూ 75 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గ్రామాన్ని మరిగుజ్జుల గ్రామం అంటారు. ఈ గ్రామంలో దాదాపు 150 ఏళ్ల క్రితం కేవలం మరిగుజ్జు ప్రజలు మాత్రమే నివశించేవాళ్లని చెబుతారు. ఈ ప్రాంతంలో ప్రస్తుతం కనిపించే ఇళ్లు కూడా అదే విషయాన్ని నిరూపిస్తాయి.

ఈ ఇళ్లు కేవలం 1.5 నుంచి 2 మీటర్లే. దీనిని బట్టి చూస్తే ఇక్కడ నిజంగానే మరిగుజ్జులు నివశించి ఉండవచ్చని అంచనా. అయితే ఇక్కడ ప్రజలకు ఆహారంలో పోషకాలు అందకపోవడం వల్లనే వీళ్లు ఇలా పొట్టివాళ్లుగా మిగిలిపోయారని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

2005లో ఇక్కడ శాస్త్రవేత్తలకు దొరికిన 25 సెంటీమీటర్ల ఓ మమ్మీ కూడా ఇదే విషయాన్ని నిర్ధారిస్తోంది.

చీకటి గ్రామం వెగనేలా గ్రామం:

Viral Villages

ఈ గ్రామం ఇటలీలో ఉంది. ఇటలీ అంటేనే ప్రకృతి అందానికి, ఖరీదైన కట్టడాలకు నిలయం. అయితే ఇక్కడి మిలాన్ నగరంలోని పర్వతాల మధ్యలో ఓ లోయలో ఈ గ్రామం ఉంటుంది. అంత లోతులో ఉండడం వల్ల ఈ గ్రామానికి సూర్య కిరణాలు కూడా అందవు.

అందుకే చలికాలం వచ్చిందంటే దాదాపు 3 నెలల పాటు ఇక్కడ సూర్యుడే కనిపించడు. దీంతో అక్కడి కొంతమంది యువకులు, ఇంజనీర్లు కలిసి కొండలపైన కొన్ని పెద్ద పెద్ద అద్దాలు పెట్టారు. సూర్యుడి కిరణాలు ఈ అద్దాలపై పడి గ్రామంలోకి ప్రసరించేలా అమర్చారు.

దీనివల్ల ఈ గ్రామానికి అవసరమైన వెలుగు వస్తోంది. అంటే ఈ గ్రామానికి ప్రత్యేకంగా వాళ్ల సూర్యుడిని ఏర్పాటు చేసుకున్నారన్నమాట.

ఇవి ప్రపంచంలోని టాప్-5 వింతైన గ్రామాలు. ఇలాంటి ఇంకా ఎన్నో ఉన్నాయి. వాటి గురించి మళ్లీ చెప్పుకుందాం.

#ViralVideos #ViralVilalges #Italy #Mexico #Iran #India #Kashmir

Spread the love

2 thoughts on “Viral Villages | ప్రపంచంలోనే వింతైన గ్రామాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *