
Viral | ప్రపంచంలో ఎన్నో దీవులు ఆహ్లాదాన్ని కలిగించే వాతావరణంతో ఉంటే.. మరికొన్ని ప్రపంచానికి దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటాయి. కానీ ఇప్పుడు చెప్పబోయే దీవులు మూడో రకం.
ఈ దీవులు ఆహ్లాదానికి, ప్రశాంతతకే కాదు.. జంతువులకూ ప్రత్యేకమే. ఎందుకంటే ఈ దీవులన్నీ జంతువులతో నిండిపోయాయి. ఒక్కో దీవిలో ఒక్కో జాతి జంతువు ఆక్రమించింది.
అక్కడ మనుషుల సంఖ్యకు పదింతలు జంతువుల సంఖ్య ఉంటుంది. ఇంకొన్నింటిలో కేవలం జంతువులే ఉంటాయి. మరికొన్ని మనుషులు అడుగుపెట్టడానికే భయపడేలా ఉంటాయి.
అలాంటి దీవుల్లో టాప్ 6 గురించి ఇప్పుడు చూద్దామా..!
జపాన్‌లోని క్యాట్ ఐల్యాండ్:

జపాన్ సంస్కృతిలో పిల్లులకు చాలా ప్రాముఖ్యం ఉంది. అక్కడ పిల్లులను గుడ్‌లక్‌గా చూస్తారు. అందుకే చాలామంది పిల్లులను పెంచుకోవడానికి ఇష్టపడతారు. అందుకే జపాన్‌లో పిల్లులకోసం ప్రత్యేకంగా ఓ దీవి ఉంది.
అదే క్యాట్ ఐల్యాండ్. దీని అసలు పేరు తషిరోజిమా. ఈ దీవిలో ఒకప్పుడు 800 మంది వరకు నివశించేవాళ్లు. కానీ ఇప్పుడు కేవలం 16 మంది మాత్రమే నివశిస్తున్నారు.
ఇక చాలా మంది వాళ్ల పెంపుడు పిల్లులను ఇక్కడే వదిలి వెళ్లిపోవడం, ఇంకొంతమంది తమ పిల్లులను తెచ్చి ఇక్కడ వదిలేయడంతో ఈ దీవిలో పిల్లుల సంఖ్య పెరిగిపోయింది.
ప్రస్తుతం ఈ దీవిలో దాదాపు 160 నుంచి 200 వరకు పిల్లులున్నాయి. అంటే ఇక్కడ ఉండే పిల్లులకు పది రెట్లన్నమాట. ఇన్ని పిల్లులు ఉండడంతో ఈ దీవి ఓ టూరిస్ట్ స్పాట్‌గా మారింది.
రోజూ చాలామంది టూరిస్టులు ఇక్కడికొచ్చి పిల్లులతో గడిపి, వాటికి ఏదో ఒకటి పెట్టి వెళుతుంటారు. అందుకే టూరిస్టుల కోసం పిల్లులు ఒడ్డు దగ్గరే కాపలా కాస్తుంటాయి. వచ్చిన టూరిస్టులను పలకరిస్తుంటాయి.
కుందేళ్ల దీవి:

ఇంతకుముందు చెప్పుకున్న క్యాట్ ఐల్యాండ్‌లానే.. ఇది కూడా జపాన్‌లో ఉన్న ఓ ర్యాబిట్ ఐల్యాండ్. దీని పేరు ఒకునోషిమా. ఇక్కడికి ఇన్ని కుందేళ్లు ఎలా వచ్చాయో ఇప్పటికీ మిస్టరీనే.
అయితే రెండో ప్రపంచం యుద్ధం సమయంలో ఈ దీవిలో జపాన్ సైన్యం విషవాయువులపై ప్రయోగాలు చేసిందట. ఆ ప్రయోగాల కోసం తెచ్చిన కుందేళ్ల సంతతే ఇదని కొందరు నమ్ముతారు.
ఈ ఐల్యాండ్‌లో దాదాపు 1000 నుంచి 1500 వరకు ఉంటాయి. ఇక్కడ కేవలం 20 నుంచి 30 మంది మాత్రమే నివశిస్తున్నారు. వాళ్లలో చాలామంది ఇక్కడికి వచ్చే టూరిస్టులకు దీవిని చూపించే టూరిస్ట్ గైడ్స్
పందుల దీవి:

పిగ్ ఐల్యాండ్. వినడానికి వింతగా ఉన్నా.. ఇలాంటి ఓ దీవి కూడా ఉంది. ఆ దీవిలో మొత్తం పందులే ఉంటాయి. అక్కడ మనుషులు ఎవరూ నివశించరు.
కరీబియన్ దీవుల్లోని బహామాస్ ప్రాంతంలో ఉండే అతి చిన్న దీవి ఎగ్జుమా. దీన్నే బిగ్ మేజర్ కే అంటారు. ఈ దీవినే పిగ్ ఐల్యాండ్ అంటారు. దాదాపు 20 నుంచి 30 పందులు మాత్రమే ఉంటుంది.
వీటిని చూడడానికి చాలామంది టూరిస్టులు ఇక్కడికి వస్తుంటారు. అలా వచ్చిన టూరిస్టులకు సముద్రంలో ఈత కొడుతూ ఈ పందులు వెల్‌కమ్ చెబుతుంటాయి.
గుర్రాల దీవి:

పిల్లి, కుందేల్లు, పందులే కాదు గుర్రాలకు కూడా ఓ దీవి ఉంది. ఈ దీవి పేరు అసటీగ్ ఐల్యాండ్. ఇది ఇది అమెరికాలోని మేరీల్యాండ్, వర్జీనియా మధ్యలో ఉండే ఓ 37 మైళ్ల విస్తీర్ణం ఉన్న ఓ పల్చటి ఇసుక దీవి.
ఈ దీవినే గుర్రాలు తమ ఇల్లుగా ఎంపిక మార్చుకున్నాయి. ఇక్కడ దాదాపు 300 గుర్రాల వరకు ఉన్నాయి. అలాగే ఇవి 300 ఏళ్ల నుంచి అక్కడ నివశిస్తున్నాయి.
వీటిని కొంతమంది తమతో తెచ్చుకుని.. ఆ తర్వాత స్థానికంగా విధించే పన్నులను తట్టుకోలేక ఇక్కడ వదిలేసేవారు. అలా అలా ఇక్కడ గుర్రాల సంఖ్య పెరిగిపోయింది.
ప్రస్తుతం ఇక్కడి గర్రాలు రెండు గుంపులుగా ఉన్నాయి. వాటిలో ఒక గుంపు చుట్టుపక్కల దీవుల జనాలతో కలిసిపోయాయి. ఇక రెండో గుంపు జనాలను దగ్గరకు కూడా రానివ్వవు.
పీతల దీవి:

ఆస్ట్రేలియాలోని ఓ దీవి పేరు క్రిస్‌మస్ ఐల్యాండ్. ఈ ఐల్యాండ్‌కి ఓ ప్రత్యేకత ఉంది. ఈ దీవిలో ఎక్కడ చూసినా రెడ్ క్రాబ్స్ అంటే ఎర్ర పీతలు తిరుగుతూ ఉంటాయి.
దాదాపు 4 నుంచి 5 కోట్ల సంవత్సరాల నుంచి క్రితం నుంచి ఇవి ఇక్కడ ఉంటున్నాయని చెబుతారు శాస్త్రవేత్తలు. అలాగే ప్రస్తుతం వీటి సంఖ్య దాదాపు 5 కోట్ల వరకు ఉంటుందని చెబుతారు.
గుంపులు గుంపులుగా తిరుగుతుంటాయి. అయితే ఇన్ని పీతలున్నా.. ఎలాంటి ప్రమాదం లేదు. అవి మనుషులను ఏమీ చేయవు. ఈ దీవిలో చాలామంది హాయిగా నివశిస్తున్నారు.
ఇక్కడ బార్లు, రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. సో భయం లేకుండా వెకేషన్‌కు వెల్లొచ్చు. అంతేకాదు ఈ పీతల వీడియోలు ఇప్పటికీ బాగా వైరల్(Viral) అవుతుంటాయి.
పాముల దీవి:

ఇప్పటివరకు చెప్పిన దీవులన్నీ వేరు.. ఇప్పుడు చెప్పబోతున్న స్నేక్ ఐల్యాండ్ వేరు. ఎందుకంటే ఇంతకుముందు చెప్పిన దీవుల్లో మనుషులు వెళుతుంటారు. వస్తుంటారు.
కానీ ఈ స్నేక్ ఐల్యాండ్‌కి మాత్రం ఒక్కరంటే ఒక్కరు కూడా వెళ్లరు. ఎందుకంటే ఈ దీవి పేరుకు తగ్గట్టే మొత్తం పాములతో నిండి ఉంటుంది.
ఓ అంచనా ప్రకారం.. ప్రతి చదరపు అడుగుకు 1 నుంచి 6 చొప్పున ఇక్కడ పాములు ఉంటాయి.
ఈ దీవి బ్రెజిల్ రాజదాని సావోపోలోకు దగ్గరలో ఉంది. దీని పేరు ఇలా దా కిమాదా గ్రాండే. పాముల భయంతో ఇక్కడికి ప్రజలు వెళ్లడాన్నే నిషేధించింది బ్రెజిల్ ప్రభుత్వం.
ఈ దీవిలో ఉండే లైట్ హౌస్‌లో ఇంతకుముందు ఓ ఫ్యామిలీ ఉండేదట. కానీ అతడు పాము కాటు వల్ల చనిపోవడంతో లైట్ హౌస్‌ను కూడా బ్రెజిల్ ప్రభుత్వం ఖాళీగా వదిలేసిందని చెబుతారు కొంతమంది.
ఏది ఏమైనా ఇప్పటివరకు చెప్పిన దీవులన్నింటిలో ఇదే అత్యంత ప్రమాదకరమైన, ప్రాణాంతకమైన దీవి. ఏమంటారు..?
#RabitIsland #SnakeIsland #CatsIsland #PigIsland #HorseIsland #Japan #Brazil #Viral Viral