

Online Gaming | ఆన్‌లైన్ గేమింగ్.. కరోనా సమయంలో దీనికి ఎనలేని ప్రాముఖ్యత లభించింది. లాక్ డైన్ సమయంలో టైం పాస్ చేయడానికి ప్రతి ఒక్కరు ఆన్‌లైన్ గేమింగ్ బాటపట్టారు. వాటిలో అత్యధిక మంది పబ్‌బీ, ఫ్రీఫైర్, కాల్ ఆఫ్ డ్యూటీ వంటి బ్యాట్లింగ్ గేమ్స్‌నే ఇష్టపడ్డారు.
ప్రపంచంలో వీటికి ఉన్న క్రేజ్ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే పిల్లలు వీటికి అడిక్ట్ అయిపోతున్నారని తల్లిదండ్రులు మొరపెట్టుకుంటున్నా ప్రభుత్వ చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. తాజాగా వీటిపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
త్వరలోనే ఆన్‌లైన్ గేమింగ్‌కి చెక్ పెడతానని, ముఖ్యంగా బ్యాట్లింగ్ గేములను నిలిపివేస్తానని తెలిపారు. దీనికి సంబంధించిన బిల్లును త్వరలో రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్నట్లు ఆయన చెప్పారు.
ఆన్‌లైన్ గేమింగ్ కారణంగా పలు ఆత్మహత్యలు, డబ్బు నష్టం, గ్యాంబ్లింగ్ జరగడం చూశామని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. దీంతో త్వరలో తమిళనాడు రాష్ట్రంలో ఆన్‌లైన్ గేమింగ్‌కు తెర పడనుందని అర్థం అవుతోంది.
#TamilNadu #Stalin #OnlineGaming #PUBG