

Tamilnadu | ఇటీవల సోషల్ మీడియా ద్వారా అనేక దారుణాలు వెలుగు చూస్తున్నాయి. అనేకమంది తమకు జరిగిన అన్యాయాలను సైతం సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.
ఇదే విధంగా తమిళనాడుకు చెందిన ఓ వీడియా నెట్టింట వైరల్ అయింది. ఈ వీడియోలో ఓ వ్యక్తి బొంగు తీసుకొని ఎద్దులపై విరుచుపడుతున్నాడు. ఇష్టారాజ్యంగా వాటిని కొడుతున్నాడు.
అడ్డంవచ్చిన మనుషులను సైతం బాదుతున్నాడు. ఈ వీడియో వైరల్ కావడంతో తమిళనాడు పోలీసులు ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాల్టీ టు యానిమల్స్ చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు.
అనంతరం ఆ సంఘటనపై దర్యాప్తు చేపట్టి ఆ వ్యక్తిని అరెస్ట్ చేశామని మధురై ఎస్‌పీ వీ బాస్కరన్ తెలిపారు.
#Bulls #TamilNadu #Police #Case