Suicide Machine | వామ్మో ఇది క్షణాల్లో చంపేస్తుంది

Suicide Machine

Suicide Machine

Suicide Machine | ఈ ఫోటో చూడగానే అబ్బ ఇదేదో స్పేష్ షటిల్‌లా ఉందే.. భలే ఉంది అనుకుంటున్నారా..? ఒక్కసారి అందులో పడుకుని చూడాలనుకుంటున్నారా..? ఆగండాగండి.. అలాంటి ప్రయత్నం మాత్రం చేయకండి.

ఎందుకంటే ఇది సూపర్ టెక్నికల్ బెడ్ కాదు, స్పేస్ క్రాఫ్ట్ అంతకంటే కాదు. ఇదో సూసైడ్ మెషీన్. మీరు విన్నది నిజమే. ఎవరైనా ఇందులో పడుకున్న క్షణాల్లో ఇది ప్రాణాలు తీసేస్తుంది.

స్విట్జర్‌ల్యాండ్‌లో సూసైడ్‌ని లీగల్ చేసేశారు ఇప్పుడు. ఈ క్రమంలోనే ఎలాంటి నెప్పి లేకుండా చంపడానికి ఈ మిషిన్ ఉపయోగించబోతున్నారు అక్కడ.

ఈ మెషిన్ పేరు సార్కో. హైపోక్సియా, హైపోకాప్నియా విధానంలో ఇది మనిషిని చంపుతుంది.

అంటే కణజాల స్థాయిలో ఆక్సిజన్ సరఫరా తగ్గడం, మరణానికి దారితీసే రక్తంలో కార్బన్ డయాక్సైడ్‌ను తగ్గించడం ద్వారా నొప్పిలేకుండా చంపుతుంది ఈ మెషీన్.

ఈ మెషీన్‌ పైన ఉన్న గ్యాస్ క్యాప్యూల్‌లోకి మనిషిని పంపిస్తారు. అలా పంపించిన తర్వాత లోపల ఆక్సిజన్ స్థాయిని క్షణంలో పూర్తిగా తగ్గించేస్తారు. కణాలకు కూడా ఆక్సిజన్ అందని స్థాయికి చేరిపోతుంది.

దీంతో కను రెప్పలు తప్ప ఇంకేమీ కదిలించలేని స్థితికి మనిషి చేరిపోతారు. శరీరానికి పక్షవాతం వచ్చినట్లవుతుంది.

దీంతో కేవలం నిమిషంలోనే నొప్పిలేకుండా చనిపోతారు. ఇక ఈ మెషీన్‌ని ఎక్కడికైనా తీసుకెళ్లేలా తయారు చేశారు.

స్విట్జర్లాండ్‌లో దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారు బతికి ఉండటం కంటే చనిపోవటమే మేలు అనేకునేవారు మెర్సీ కిల్లింగ్, కారుణ్య మరణం లేదా యూథనేషియా(euthanasia) ఉపయోగిస్తారు.

కారుణ్య మరణం ద్వారా చనిపోవాలని అనుకునేవారు ప్రభుత్వం నుంచి చాలా రకాల అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది.

అసిస్టెడ్-డైయింగ్ కోసం డాక్టర్లను ఒప్పించి లిక్విడ్ సోడియం పెంటోబార్బిటల్ తీసుకోవాలి.

‘డాక్టర్ డెత్’ అని పేరొందిన డాక్టర్ ఫిలిప్ నిట్ష్కే ఈ ఆత్మహత్య యంత్రాన్ని తయారు చేయడంలో కీలక పాత్ర పోషించారు. నిట్ష్కే ఎగ్జిట్ ఇంటర్నేషనల్ అనే నాన్-ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కు డైరెక్టర్‌గా ఉన్నారు.

స్విట్జర్లాండ్‌లో సహాయక ఆత్మహత్య చట్టబద్ధం కాగా..2020లో సుమారు 1,300 మంది మెర్సీ కిల్లింగ్ సంస్థల సేవలను వినియోగించారు.

#SuicideMachine #Switzerland #MercyKilling

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *