1911 Train Mystery | వందేళ్లు దాటినా వీడని ట్రైన్ మిస్టరీ

1911 Train Mystery | 1911లో రోమ్ నుంచి బయలుదేరిన ట్రైన్.. 1840లో మెక్సికో చేరుకుంది. అక్కడి నుంచి 1940లో రష్యాకు చేరింది. ఆ తర్వాత

Spread the love
1911 Train Mystery

1911 Train Mystery | 1911లో రోమ్ నుంచి బయలుదేరిన ట్రైన్.. 1840లో మెక్సికో చేరుకుంది. అక్కడి నుంచి 1940లో రష్యాకు చేరింది. ఆ తర్వాత జర్మనీ, రొమేనయా.. ఇదేంటి..? అది రైలా..? టైం మెషినా..? అనుకుంటున్నారా..? అది తెలీకే 100ఏళ్ల నుంచి జనాలు జుట్టు పీక్కుంటున్నారు. ఇంతకీ ఆ ట్రైన్ రహస్యం ఏంటి..? ఈ మిస్టరీ ఎక్కడ జరిగింది..? అనే ప్రశ్నలతో పాటు ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న రాథేశ్యామ్‌కి ఈ ట్రైన్ మిస్టరీకి సంబంధం ఏంటి..?

1912లో టైటానిక్ షిప్, 1911లో జెన్నెట్టీ ట్రైన్ రెండింటికీ ఓ లింక్ ఉంది. రెండూ ఫస్ట్ టైం ట్రావెల్‌‌లోనే కనిపించకుండా పోయాయి. అయితే టైటానిక్ ప్రమాదానికి గురై సముద్ర గర్భంలోకి వెళ్లిపోయింది. అందులోని ప్రయాణికులు వందల మంది చనిపోగా మిగిలిన వాళ్లు ప్రాణాలతో బయటపడ్డారు. కానీ జెన్నెట్టీ ట్రైన్‌ ఎటు వెళ్లింది..? అందులోని ప్రయాణికులు ఏమైపోయారు ఇప్పటికీ ఎవరికీ తెలీదు. చాలామంది ఈ ట్రైన్ మిస్టరీ గురించి వినే ఉంటారు. 106 మంది ప్రయాణికులతో ఆర్భాటంగా మొదలైన ఈ ప్రయాణం ప్రపంచ చరిత్రలోనే అంతుచిక్కని ప్రయాణంగా నిలిచిపోయింది. అసలు ఆ ట్రైన్ ఏమైంది..? అందులోని ప్రయాణికులు ఎటు వెళ్లారు..? ఈ ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం లేదు. అసలేంటి ట్రైన్ మిస్టరీ..? ట్రైన్ ట్రావెల్ చేద్దామని ఎక్కిన ఆ 106 మంది ఏకంగా టైం ట్రావెల్ ఎలా చేశారు..?

అది 1911, జూన్ 14వ తేదీ. జెన్నెట్టీ అనే కంపెనీ ఫస్ట్ టైం ఓ ట్రైన్‌ను ప్రారంభించింది. 3 బోగీలతో ఉండే లగ్జరీ ట్రైన్‌ ఇది. 100 మంది ప్రయాణికులు, ఆరుగురు ట్రైన్ సిబ్బందితో రోమ్ నుంచి బయలుదేరింది. దారి మధ్యలో ఎంతో అందమైన ప్రకృతిని చూస్తూ ప్రయాణికులు ఆనందపడుతున్నారు. అలాగే మరికొద్ది సేపట్లో వాళ్లు చేరుకోబోతున్న ఓ టన్నెల్ గురించి ఆలోచిస్తున్నారు. ఆ కాలంలో నిర్మించిన అతి పొడవైన ట్రైన్ టన్నెల్ అది. కిలో మీటరు పొడవున లంబార్డ్ కొండను తొలిచి ఈ టన్నెల్ నిర్మించారు. ఆ టన్నెల్ ఎంత అందంగా ఉంటుందో అని ఆలోచిస్తున్నారు. కానీ వాళ్లకి తెలీదు ఆ టన్నెల్ వాళ్లని ప్రపంచం నుంచి పూర్తిగా తుడిచేయబోతోందని.

1911 Train Mystery
1911 Train Mystery

ఇంతలో టన్నెల్ రానేవచ్చింది. నెమ్మదిగా ట్రైన్.. టన్నెల్‌లోకి వెళ్లింది. అంతే.. ఆ ట్రైన్ మళ్లీ బయటకు రాలేదు. అవతలి స్టేషన్‌ చేరుకోవాల్సిన ఆ ట్రైన్ ఎప్పటికీ చేరుకోలేదు. అసలు ఆ ట్రైన్ ఏమైందో తెలుసుకోవాలని ఇటలీ ప్రభుత్వం అనేక సెర్చ్ ఆపరేషన్స్‌ని నిర్వహించింది. అప్పుడే వాళ్లకి ఓ ఇద్దరు వ్యక్తులు దొరికారు. వాళ్లు ఆ ట్రైన్ ప్యాసెంజర్స్ అని గుర్తించి ఆసుపత్రిలో చేర్పించారు. వాళ్ల తలకు బాగా దెబ్బలు తగిలాయి. కొన్ని రోజుల ట్రీట్మెంట్ తర్వాత వాళ్లు కోలుకున్నారు.

కానీ వాళ్లు చెప్పిన దాన్ని బట్టి చూస్తే.. అధికారులకు పిచ్చెక్కిపోయింది. ‘టన్నెల్‌ను ట్రైన్ సమీపిస్తున్నప్పటికే అక్కడ తెల్లటి పొగ అల్లుకుంది. అంతా చీకటిగా ఉంది. లోపలి నుంచి ఏవో సౌండ్స్ వినిపిస్తున్నాయి. ఇంతలో ట్రైన్ ఇంజిన్ బోగీ ఆ పొగలోకి వెళ్లిపోయింది. పొగ దట్టంగా అలుముకుంటోంది. నాకు భమేసింది. వెంటనే ట్రైన్ లో నుంచి దూకేశాను. నాతో మరో వ్యక్తి కూడా దూకేయడం చూశాను’ ఇది వారిలో ఓ వ్యక్తి చెప్పిన కథనం.

వాళ్లు చెప్పింది నమ్మాలో..! నమ్మకూడదో..! అధికారులకు అర్థంకాలేదు. చాలా రోజులు సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించారు. కానీ చిన్న క్లూ కూడా లేదు. కొన్నాళ్ల పాటు అక్కడి న్యూస్ పేపర్ల నిండా ఈ ట్రైన్‌కు సంబంధించిన ఆర్టికల్సే. కానీ ఆ తర్వాత అవన్నీ మాయమైపోయాయి. ఎక్కడా ఈ ట్రైన్ గురించి ఒక్క వార్త కూడా రావడం లేదు. ఇటలీ ప్రభుత్వం కూడా ఆ సొరంగాన్ని మూసేసింది. ఆ తర్వాత మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో ఈ టనెల్ కూలిపోయింది. దీంతో ఆ ట్రైన్‌ మిస్టరీ మిస్టరీగానే మిగిలిపోయింది. అది ఏమైంది..? అందులోని ప్రయాణికులు ఏమయ్యారు..? ఈ ప్రశ్నలు సమాధానం లేని ప్రశ్నలుగా మిగిలిపోయాయి.

1911 Train Mystery

అయితే సరిగ్గా 26ఏళ్ల తర్వాత అంటే 1937లో మళ్లీ ఈ ట్రైన్‌కు సంబంధించిన ఓ వార్త సంచలనంగా మారింది. దానికి కారణం మెక్సికోలోని ఓ మ్యూజియంలో ఉన్న ఓ సిగరెట్ పెట్టె. ఆ సిగరెట్ బాక్స్ ఎక్కడిదని చూస్తే అది ఇటలీలో 1907లో తయారైంది. అయితే ఆ సిగరెట్ పెట్టె మెక్సికో అధికారులకు 1840లో కొంతమంది పిచ్చివాళ్ల దగ్గర దొరికింది. ‘దాదాపు 104 మంది ఎక్కడి నుంచి వచ్చారో, ఎలా వచ్చారో తెలియదు. మీరెవరు..? అని అడిగితే మేమంతా ఇటలీ నుంచి వచ్చామని, జెన్నెట్టీ ట్రైన్ ఎక్కి ఇలా వచ్చామని చెబుతున్నారు. కానీ అలాంటి ట్రైన్ ఏదీ ఇటలీలో లేదు.

ఈ విషయాన్ని ఇటలీ ప్రభుత్వం కూడా ధృవీకరించింది. దీంతో వాళ్లంతా పిచ్చివాళ్లని ఆసుపత్రిలో చేర్పించాం. కానీ కొన్ని రోజులకు వాళ్లు ఎవరికీ తెలియకుండా మాయమైపోయారు. వాళ్లలో ఓ ప్రయాణికుడి దగ్గర నుంచే ఈ సిగరెట్ పెట్టె దొరికింది అంటూ మెక్సికో అధికారులు చెప్పారు. దీంతో ఇటలీ అధికారులకు మతి పోయింది. అంటే జెన్నెట్టీ ట్రైన్ ఆ సొరంగంలో నుంచి కాలంలో వెనక్కి వెళ్లిపోయిందన్నమాట.

1911 Train Mystery

కేవలం వెనక్కే కాదు.. మళ్లీ 1940లో ఈ ట్రైన్ రష్యాలో కనిపించిందని వార్తలొచ్చాయి. రష్యాలోనే కాదు.. ఆ తర్వాత కూడా ఫ్రాన్స్, రొమేనియా, జర్మనీ, చివరికి ఇండియాలో కూడా ఈ ట్రైన్ కనిపించిందని అనేక వార్తలు వినిపించాయి. కానీ దేనికీ ఆధారాలు లేకపోవడంతో అవన్నీ పుకార్లుగా కొట్టేశారు.

అయితే ఈ ట్రైన్ మిస్టరీ ఆధారంగానే ప్రభాస్ రాథేశ్యామ్ సినిమా తెరకెక్కుంతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాలో వింటేజ్ ఇటాలియన్ సెట్స్ వేయడం, ట్రైన్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడమే కాకుండా.. ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ ఆసుపత్రి సెటప్ మొత్తం సిద్ధం చేసిందట. ఇవి కూడా అప్పటి ఆసుపత్రి సెట్‌లలానే ఉన్నాయట. దీంతో ఆ ట్రైన్ మిస్టరీ ఆధారంగానే ఈ సినిమా తెరకెక్కుతోందా అని చాలా మంది డౌట్ పడుతున్నారు. కానీ మూవీ యూనిట్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ అయితే రాలేదు.

#Radhesyam #1911TrainMystery #TimeTravel

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *