Shocking | శరీరం బయట అవయవాలతో పుట్టిన చిన్నారి

Shocking | ఇంగ్లాండ్ లో ఓ వింత శిశువు జన్మించింది. పొట్ట లోపల ఉండాల్సిన అవయవాలన్నీ బయట ఉండడంతో డాక్టర్లే షాకయ్యారు. ఇది ఓ రకమైన

Spread the love
Shocking

Shocking | ఇంగ్లాండ్ లో ఓ వింత శిశువు జన్మించింది. పొట్ట లోపల ఉండాల్సిన అవయవాలన్నీ బయట ఉండడంతో డాక్టర్లే షాకయ్యారు. ఇది ఓ రకమైన శారీరక లోపమని, దీనివల్ల శరీరం లోపల తయరు కావాల్సిన అవయవాలు బయట ఏర్పడతాయని డాక్టర్లు తెలిపారు. ఈ పరిస్థితిని గ్యాస్ట్రోస్కైసిస్(Gastroschisis) అంటారని వైద్యులు వెల్లడించారు. ఇలాంటి లోపం ప్రతి 10వేల శిశువుల్లో ఒకరిలో బయటపడుతుందని చెప్పారు.

ఆష్ లే(29) 3 నెలల గర్భవతిగా ఉన్నప్పుడే డాక్టర్లు శిశువులో ఈ మార్పును గుర్తించి ఆమెకు తెలియజేశారు. కడుపులో పెరగాల్సిన అవయవాలు బొడ్డు భాగంలోనుంచి బయటికి పడిపోయి అక్కడే పెరుగుతాయని వెల్లడించారు.

కాగా.. ఆ చిన్నారికి వైద్యులు విజయవంతంగా ఆపరేషన్ చేశారు. ఓ 3 వారాలు ఆసుపత్రిలోనే ఉంచి.. ఏదైనా అనుకోని పరిస్థితులు తలెత్తుతాయేమోనని నిపుణులైన డాక్టర్లు అనుక్షణం పర్యవేక్షించారు. ప్రస్తుతం ఆ చిన్నారి వయసు 5 వారాలు.

ఇదిలా ఉంటే, చిన్నారి తల్లిదండ్రులు ఆష్ లే, సర్ఫ్ తమ బిడ్డకి కోఆ(KOA) అని పేరు పెట్టారు. కోఆ అంటే హవాయి దేశపు భాషలో వీరుడు, శూరుడు అని అర్థం. నిజానికి ఈ పేరు బిడ్డకు ఈలోపం ఉందని తెలియక ముందే ఆష్ లే, సర్ఫ్ అనుకున్నారు. అయితే ఇప్పుడు కడుపులోనే ఇంత పెద్ద యుద్ధం చేసిన బిడ్డకి ఈ పేరు సరిగ్గా సరిపోయింది మరి.

#RareCondition #Baby #Organs #OutsideBody

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *