
Shahadat Ali

Shahadat Ali | నడిరోడ్డుమీద ఓ అమ్మాయి చేతిలో 22 రెండు చెంప దెబ్బలు తిన్న లక్నో క్యాబ్ డ్రైవర్ షహాదత్ అలీ గుర్తున్నాడా..? ఇప్పుడతను ఓ శపథం చేశాడు. అది కూడా అల్లాటప్పా శపథం కాదు.
తన జీవితంలో ఇకపై మగాళ్ల కోసం.. అందులోనూ ఆడాళ్ల చేతిలో మోసపోతున్న, హింసలకు గురవుతున్న మగాళ్ల కోసం పోరాడతానని శపథం చేశాడు.
అదేంటి ఓ ట్యాక్సీ డ్రైవర్ ఇంత పెద్ద శపథం చేయడం ఏంటని అనుకుంటున్నారా..! అయితే మీకో ట్విస్ట్ ఇప్పుడు షహాదత్ అలీ ట్యాక్సీ డ్రైవర్ కాదు. పొలిటికల్ లీడర్. షాక్ తగిలినా.. ఇది నిజం. అలీ ఈ మధ్యనే ప్రగతిశీల్ సమాజ్ వాదీ పార్టీలో చేరారు.

షహాదత్ అలీ. లక్నోలో ఓ క్యాబ్ డ్రైవర్. సరిగ్గా రెండు నెలల క్రితం అంటే రాత్రి టైంలో ఓ అమ్మయి అతడిపై దాడి చేసింది. నడిరోడ్డుపై అందరూ చూస్తున్నా.. కొంతమంది అడ్డుకుంటున్నా.. ఆపకుండా కొడుతోంది.
ఎలాగోలా చుట్టుపక్కల వాళ్లు ఆపి ఆ డ్రైవర్‌ను అక్కడి నుంచి పంపించారు. కానీ ఆ అమ్మాయి కోపం తగ్గలేదు. పోలీస్ స్టేషన్‌కి వెళ్లి షహాదత్ అలీపై కేస్ పెట్టింది.

ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. పోలీసులు ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా అలీని అరెస్ట్ చేసి సెల్‌లో వేశారు. అతడిని విడిపించడానికి వాళ్ల అన్నయ్య స్టేషన్‌కి వస్తే.. అతడిని కూడా లోపలేశారంట.
అయితే ఎవరు తీశారో కానీ.. రోడ్డుపై జరిగిన రచ్చనంతా వీడియో తీశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో కనిపించడంతో హహాదత్ అలీకి నెటిజన్ల నుంచి విపరీతంగా సపోర్ట్ వచ్చింది.
వెంటనే ఆ అమ్మాయిని అరెస్ట్ చేయాలని లక్షలమంది ట్వీట్లు చేయడం మొదలుపెట్టారు. దీంతో పోలీసులు కూడా వెనక్కి తగ్గి షహాదత్ అలీని విడిచిపెట్టారు. అయితే అమ్మాయిని అరెస్ట్ చేయలేదు.
అదేమంటే ఆ అమ్మాయికి మతిస్థిమితం లేదని, అందుకే అలా ప్రవర్తింస్తుంటుందని చెప్పుకొచ్చారు. మరి ఈ విషయం షహాదత్‌ను అరెస్ట్ చేసే ముందు పోలీసులకు ఎందుకు పట్టించుకోలేదు..? ఏమో..!

జైలు నుంచి బయటకు రాగానే షహాదత్ అలీకి విపరీతంగా మద్దతు లభించింది. అదే సమయంలో ఓ మీడియా ఛానల్.. ఆమెను తిరిగి ఎందుకు కొట్టలేదు..? అని ప్రశ్నించింది.
అప్పడు అలీ చెప్పిన సమాధానం అతడిపై అభిమానాన్ని మరింత పెంచింది. ఆమెను కొట్టడానికి క్షణం పట్టదని, అయితే తన సంస్కారం తనకు అడ్డొచ్చిందని షహాదత్ చెప్పాడు.
దీంతో జనాల్లో అతడో హీరో అయిపోయాడు. ఈ క్రమంలోనే ఈ మధ్య పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన అలీ.. తాను మగాళ్ల కోసం పోరాడతానంటూ ప్రకటించాడు. ఏది ఏమైనా.. మగాళ్లకు ఓ సపోర్ట్ దొరికినందుకు మీరంతా సంతోషంగా ఉన్నారా..!