

History | భూమి చుట్టూ సూర్యుడు, నక్షత్రాలు, సూర్యుడు, గెలాక్సీలు తిరుగుతున్నాయి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు తిరగడం ఏంటి..? నీకేమైనా పిచ్చా..? విశ్వంలో మనది మిల్కీవే గెలాక్సీ. అందులో ఓ నక్షత్రం మన సూర్యుడు. ఆ సూర్యుడి చుట్టూ తిరుగుతున్న గ్రహాల్లో మన భూమి అరుదైన వాతావరణం ఉన్న ఓ చిన్న గ్రహం. అని టకటకా చెప్పేస్తాడు.
ఇదంతా ఎవరైనా చుట్టుపక్కలవాళ్లు వింటే.. ‘అబ్బ ఈ పిల్లాడు ఎంత తెలివైన వాడు..!’ అని మెచ్చుకుంటారు కూడా.
కానీ సరిగ్గా 4, 5 శతాబ్దాల క్రితం ఈ మాట చెప్తే మాత్రం బట్టలూడదీసి వీధుల్లో ఊరేగిస్తారు. కనికరం లేకుండా చంపేస్తారు. ఆశ్చర్యంగా ఉందా..? కానీ ఇది నిజం. ఈ శిక్ష అనుభవించింది జోర్డానో బ్రూనో(giordany bruno) అనే ఇటాలియన్ శాస్త్రవేత్త.
దేశాన్నే ఎదిరించిన శాస్త్రవేత్త జోర్డానో బ్రూనో:
జోర్డానో బ్రూనో.. 1548లో ఇటలీలో పుట్టాడు. అతడో ఆస్ట్రాలజిస్ట్. మ్యాథమెటీషియన్. కవి. ఖగోళ పరిశోధకుడు. తత్వవేత్త. ఇంతటి గొప్ప వ్యక్తులను ఆ కాలంలో ఎంతో గౌరవించేవాళ్లు.
కానీ బ్రూనో చెప్పిన ఒకే ఒక్క సిద్ధాంతం ఆయన జీవితాన్ని చీకటి మయం చేసింది. దేశద్రోహిగా ముద్రపడేలా చేసింది.జైలు శిక్ష అనుభవించి, సజీవదహనం శిక్ష అనుభవించి ప్రాణాలొదిలేలా చేసింది.
ఇంతకీ ఆయన చెప్పిన సిద్ధాంతం ఏంటో తెలుసా..? సూర్యుడు ఓ నక్షత్రం. ఆ నక్షత్రం చుట్టూ తిరిగే ఓ చిన్న గ్రహమే భూమి. అవును.. ఆయన చెప్పిన సిద్ధాంతం ఇదే.
క్రిస్టియన్లకు కోపం తెప్పించిన జోర్డానో:
16, 17వ శతాబ్దాల్లో అప్పుడప్పుడే ఖగోళ పరిశోధనలపై శాస్త్రవేత్తల ఆసక్తి పెరుగుతోంది. ఆ కాలంలోనే భూకేంద్ర సిద్ధాంతం బాగా పాపులర్. ఈ సిద్ధాంతాన్ని క్రిస్టియన్లు బలంగా నమ్మేవాళ్లు.
ఈ విశ్వం మధ్యలో భూమి ఉందని, భూమి చుట్టూ మిగతా గ్రహాలు, నక్షత్రాలు తిరుగుతున్నాయని ప్రజలంతా క్రిస్టియన్ ప్రజలంతా నమ్మేవాళ్లు. అప్పటి రాజులు, పాలకులు కూడా ఇదే విషయాన్ని సమర్థించేవాళ్లు.
ఒకవేళ ఎవరైనా ఇది తప్పు అని చెబితే వారికి తీవ్రమైన శిక్షలు విధించేవాళ్లు. ప్రాణాలే తీసేసేవాళ్లు. అది తెలిసి కూడా జోర్డానో తన సిద్ధాంతాన్ని బహిరంగంగా ప్రకటించాడు. దీంతో క్రిస్టియన్లకు కోపం వచ్చింది.
వాళ్ల మత విశ్వాసాలను దెబ్బ తీసేలా జోర్డానో ప్రవర్తించాడని చర్చి నిర్వాహకులకు కంప్లైంట్ చేశారు. ఇది తెలుసుకున్న అక్కడి క్రిస్టియన్ రాజులు జోర్డానోను జైల్లో వేశారు.
క్రిస్టియన్స్ మత విశ్వాసాలను, కాథలిక్ సిద్ధాంతాలను, క్రీస్తు దైవత్వాన్ని కించపరిచాడని జోర్డానోపై అభియోగాలు మోపారు.
ప్రాణాన్ని లెక్క చేయని బ్రూనో:

ఆ తర్వాత జోర్డానో తప్పులను ఒప్పుకోవాలని, అలాగే అతడి సూర్య కేంద్రక సిద్ధాంతం కూడా తప్పని ఒప్పుకోవాలని హెచ్చరించారు. అలా చేస్తే శిక్ష తగ్గిస్తామని చెప్పారు. కానీ జోర్డానో అందుకు అంగీకరించలేదు.
‘నేను మాట్లాడిన ప్రతి మాట వాస్తవమే. వాటిని తాను పూర్తిగా నమ్ముతున్నా’ అన్నాడు. దీంతో 1600 ఫిబ్రవరి 17న జోర్డానోను నగ్నంగా వీధుల్లో ఊరేగించి సజీవదహనం చేశారు.
జోర్డానో చనిపోయే సమయంలో కూడా తన సిద్ధాంతాలే కరెక్ట్ అని చెప్పాడు. చిట్ట చివరిగా తనకు ఉరి శిక్ష విధించిన వ్యక్తిని చూస్తూ.. శిక్ష అనుభవించే నాకంటే.. నువ్వే ఎక్కువ భయపడుతున్నట్లున్నావ్’ అని అన్నాడు.
బ్రూనో మాటే నిజమైంది:
ఆయన మరణించిన కొన్నేళ్లకు ప్రపంచం మొత్తం సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ఒప్పుకుంది. సూర్యుడు నక్షత్రం. సౌరకుటుంబం సెంటర్లో ఉన్నాడు. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతోంది అని ఒప్పుకున్నారు.
అయితే ఈ సిద్ధాంతాన్ని బలంగా ప్రస్తావించిన శాస్త్రవేత్తగా మాత్రం నికోలస్ కోపర్నికస్ పేరు చరిత్ర(History)లో బాగా ప్రాముఖ్యం పొందింది. అయితే ఇప్పటికీ ఇటలీలో చాలామంది జోర్డానోను తమ ఆదర్శంగా భావిస్తారు.
ఆయన సిద్ధాంతాలను పాటిస్తారు. ఆయనపై అభిమానంతో 1889 జూన్ 9న రోమ్‌లోని కాంపో డీ ఫియోరీలో ఏర్పాటు చేశారు.
#History #GiordanyBruno #Sun #Earth #Scientist #Italy