India | ఇండియా-ఆఫ్రికా ఒక్కటేనా..! అయితే ఆసియా..?

India

India | భూమ్మీద ఎన్ని ఖండాలున్నాయంటే.. 7 అని చిన్నపిల్లలు కూడా చెబుతారు. కానీ 250 కోట్ల సంవత్సరాల క్రితం ఒకే ఖండంగా ఉండేది. ఆ ఖండం పేరు పాంగ్వా. ఇప్పుడు ఆఫ్రికా, అమెరికా, ఆసియా, ఆస్ట్రేలియా.. ఇలా అన్ని ఖండాలూ అందులోనో కలిసిపోయి ఉండేవి.
అయితే అప్పటికి భూమి పూర్తి స్థాయిలో చల్లబడలేదు. దానివల్ల లోపల భారీ విస్ఫోటనలు సంభవిస్తూ ఉండేవి. అలా సంభవించిన పేళుల్ల కారణంగా ఒకటిగా ఉన్న ఖండం కొద్దికొద్దిగా విడిపోవడం మొదలైంది.
మొదట లొరేషియా, గోండ్వానా ద్వీపాలుగా ఏర్పడ్డాయి. ఆ తర్వాత కూడా ఏర్పడిన విస్ఫోటనాల వల్ల ఇప్పుడున్న 7 ఖండాలుగా ఏర్పడింది.

ఆఫ్రికాలో ఇండియా:
మిగతా భూభాగాలన్నింటి గురించి పక్కనపెడితే.. ప్రస్తుతం ఇండియా ఉన్న భూభాగం అప్పట్లో ఆఫ్రికా ఖండంలో ఓ భాగం. అయితే విచిత్రంగా టెక్టానిక్ ప్లేట్స్ కదలిక వల్ల ఇండియా.. ఆఫ్రికా నుంచి విడిపోయి ఆసియా వైపు కదలడం మొదలుపెట్టింది.
అలా ఏడాదికి 10 సెంటీమీటర్ల చొప్పున కదులుతూ 50 కోట్ల సంవత్సరాల క్రితం ఆసియా ఖండాన్ని ఢీకొట్టింది. ఇది ఎంత ప్రమాదకరంగా జరిగిందంటే ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన హిమాలయాలు అప్పుడే ఏర్పడ్డాయి.

ఇండియా వల్లే మంచుయుగం:
అప్పటివరకు భూమి చాలా వేడిగా ఉండేది. ధృవాల్లో కూడా మంచు ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే భారతదేశం ఢీకొట్టడం వల్ల హిమాలయాలు పుట్టాయో అప్పటినుంచి ఇండియాలో వాతావరణం మారిపోయింది.
ఒక్క ఇండియాలోనే కాదు.. మొత్త భూమ్మీద ఉన్న వాతావరణమే మారిపోయింది. హిమాలయాలు గాలిలోని కార్బన్ డై ఆక్సైడ్‌ను భారీగా తీసుకోవడం మొదలుపెట్టాయి.
దీంతో వాతావరణం విపరీతంగా చల్లబడిపోయింది. అప్పుడే ప్రపంచంలో మంచు యుగం మొదలైందని కూడా కొంతమంది చెబుతారు. సముద్రం నుంచి వచ్చిన తేమ హిమాలయాలను తాకి భారతదేశంలో వర్షాలు కురిపిచింది.
అలాగే హిమాలయాల్లో గంగ, యమున, బ్రహ్మపుత్ర వంటి జీవనదులు పుట్టి దేశాన్ని అద్భుతమైన వైవిధ్యభరితమైన వాతావరణంగల ప్రాంతంగా మార్చాయి.

మళ్లీ ఆఫ్రికా వైపు ఇండియా..?:
దీనివల్ల అప్పటివరకు భారత భూభాగంపై నివశించిన జీవరాసులపై తీవ్ర ప్రభావం పడింది. ఈ మార్పును అనేక జీవజాతులు తట్టుకోలేకపోయాయి. క్రమంగా అంతరించిపోయాయి.
అందుకే ఇప్పటికీ ఆఫ్రికాకు సంబంధించిన జీవజాతుల కళేబరాలు భారతదేశంలో అప్పుడప్పుడూ కనిపిస్తుంటాయి. అయితే ఇప్పుడు శాస్త్రవేత్తలు ఓ షాకింగ్ విషయం చెబుతున్నారు.
అదేంటంటే.. భూమి మళ్లీ ఆఫ్రికా వైపు వెళ్లిపోతోందట. నెమ్మదిగా ఆసియా ఖండం నుంచి దూరంగా కదులుతోందట. కానీ దీనికి ఇంకా సరైన ఆధారాలు లేవు.

కాదు.. ఆసియావైపే:
ఇదే సమయంలో ఇంకొంతమంది శాస్త్రవేత్తలు భారతదేశం ఆఫ్రికావైపు వెళ్లడంలేదని, ఆసియా వైపే ఏటా 3 సెంటీమీటర్ల చొప్పున దూసుకుపోతోందని అంటున్నారు.
అందుకే హిమాలయాల ఎత్తు కూడా పెరుగుతోందని ఆధారాలు చూపిస్తున్నారు.
కానీ దీనివల్లే ఈ మధ్య కాలంలో నేపాల్‌లో సంభవించిన అత్యంత దారుణమైన భూకంపం కూడా సంభవించిందని, భవిష్యత్తులో ఇంతకంటే భయంకరమైన భూకంపాలను ఎదుర్కోవలసి ఉంటుందని చెబుతారు.

ఈ భూమిలో ఇంకా ఎన్నో మార్పులు సంభవిస్తూనే ఉన్నాయి. అంతర్గతంగా అనుక్షణం మన ఊహకు అందని భారీ విస్ఫోటనలు సంభవిస్తున్నాయి.
వాటివల్ల ఇప్పుడు చూస్తున్న భూమి ఇలానే ఉండొచ్చు. లేదా కొత్త మార్పును సంతరించుకోవచ్చు.
ఏది ఏమైనా ఈ ఆధారాలతో భూమిపై భరతఖండం వైవిధ్యమైనదని మరోసారి నిరూపించుకుంది.
#India #Africa #Gondwana #PangaeaLand #Asia #Himalayas #TechtonicPlates #Earth #IceAg