BJP | తనపై కేసు ఓ రాజకీయం.. సంజయ్ రౌత్ సంచలన కామెంట్స్

BJP | శివసేన పార్టీ నాయకుడు సంజయ్ రౌత్‌పై ఢిల్లీలో కేసు నమోదైన సంగతి తెలిసిందే. బీజేపీని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశాడని..

Spread the love
BJP

BJP | శివసేన పార్టీ నాయకుడు సంజయ్ రౌత్‌పై ఢిల్లీలో కేసు నమోదైన సంగతి తెలిసిందే. బీజేపీని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశాడని ఈ కేసు నమోదు చేయడం జరిగింది. అయితే తాజాగా సంజయ్ రౌత్ దీనిపై స్పందించారు. తనపై కేసు నమోదు చేయడం ఓ రాజకీయ కుట్ర అని, తనను తన పార్టీని కుంగదీయడానికి బీజేపీ ఆడుతున్న ఆటలని ఆయన అన్నారు.

‘ నాపై ఢిల్లీలో నమోదైన ఎఫ్ఐఆర్ వెనుక బీజేపీ హస్తం ఉంది. బీజేపీ రాజకీయ కుట్రల్లో ఇదీ ఒకటి. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఇన్‌కమ్ టాక్స్ (ఐటీ), ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ల సహాయంతో నా పార్టీని కుంగదీయడం జరిగే పనికాదు. నా గొంతు నొక్కేందుకే బీజేపీ ఇటువంటి పన్నాగాలు పన్నుతుంది. నేను ఒక ఎంపీని. నాపై ఇటువంటి అబద్దపు ఎఫ్ఐఆర్ నమోదును ప్రోత్సహించడం అంత మంచిది కాద’ని సంజయ్ అన్నారు.

అయితే సంజయ్ ఓ ఇంటర్వ్యూలో బీజేపీ జాతీయ జనరల్ సెక్రటరీ దీప్తీ రావత్ భరద్వాజ్‌ను, ఆ పార్టీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు ఉపయోగించారని కేసు నమోదు చేశారు. బీజేపీ పార్టీ నాయకులను ఉద్దేశించి అనుచిత భాష వినియోగించడంతో పాటు, తమ పార్టీ నేతలకు వార్నింగులు ఇచ్చారని ఆమె పేర్కొంది. దీంతో సెక్షన్ 500 (పరువు నష్టం), 509 ( ఒక మహిళను అవమానించడానికి ఉద్దేశించిన పదం, చర్య)ల కింద కేసు నమోదు చేశారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *