

Police | వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ మీసాలు ఎంత పాపులర్ అయ్యాయో తెలుసు కదా..! అభినందన్ ని చూసి అలాంటి మీసాలు చాలామంది పెట్టుకున్నారు. కానీ.. తాజాగా ఓ పోలీస్ ఆఫీసర్ మాత్రం ఆ మీసాల వల్ల ఏకంగా సస్పెండ్ అయ్యాడు.
ఈ ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. రాష్ట్ర రాజధాని భోపాల్ లో రాకేష్ రానా అనే ఓ కానిస్టేబుల్ విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే అతడు బాగా పొడుగ్గా మీసాలు పెంచుకుని ఉంటాడు. అచ్చం అభినందన్ లాగే.
కానీ అలా మీసాలు పెంచకూడదని, వెంటనే తీసేయాలని పై అధికారులు ఆదేశించారు. కానీ రానా మాత్రం వాటిని తీయడానికి ఇష్టపడలేదు. దీంతో క్రమశిక్షణా చర్యలు తీసుకుంటున్నామని చెప్పి పోలీసులు అతడిని సస్పెండ్ చేశారు.
దీంతో రానా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. తాను రాజ్ ఫుట్ వంశానికి చెందిన వాడినని, మీసాలు పెంచుకోవడం తమ ఆత్మగౌరవానికి నిదర్శనమని, అలాంటి మీసాలు తీసేయాలని చెప్పడం, తొలగించనందుకు సస్పెండ్ చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు.
#Police #Suspend #Mustache #Madhyapradesh #Bhopal #Constable