

Pakistan | బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన పాటల్లో ‘టిప్ టిప్ బర్స్ పానీ’ పాట ఖచ్చితంగా ఉంటుంది. 1994లో ఖిలాడీ అక్షయ్ కుమార్, రవీనా టాండన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ‘మోహ్రా’ సినిమాలోని ఈ పాట అప్పట్లోనే ఓ ఊపుఊపింది. మళ్లీ ఇన్నాళ్టికి ఈ పాట ప్రపంచాన్ని ఊపేస్తోంది.
ఈ పాటకు ఓ పాకిస్తాన్ వ్యక్తి డాన్స్ చేస్తున్న వీడియోనే అందుకు కారణం. ఈ వీడియోలో పాటకు డాన్స్ చేసింది పాకిస్తాన్ ఎంపీ లిక్వాత్ హుస్సేన్ అంటూ వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేసింది. కొన్ని వార్తా పత్రికలు సైతం పాకిస్తాన్ ఎంపీనే ఈ పాటకు డాన్స్ చేశారని అన్నాయి.
అయితే వీడియోలో పాటకు డాన్స్ చేసింది పాకిస్తాన్ ఎంపీ కాదని, అతడు పాకిస్తానీ కొరియోగ్రాఫర్ షోయెబ్ షకూర్ అంటూ తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేసేస్తోంది. ఈ వీడియోకు సమ్మిళిత కామెంట్లు వస్తున్నాయి.
‘జాతి పరంగా వేరయ్యాయి. సగీతంతో ఏకం అయ్యాయి, పాట ఎవరిదైనా పాట, నాట్యం అద్భుతంగా ఉన్నాయి’ అంటూ కామెంట్ల వర్షం కురుస్తోంది.
#Pakistan #Bollywood #PakistanMP #TipTipbarsapani