
IndinaNavy

IndianNavy | ఆయన ఇండియన్ నేవీ అడ్మైరల్. కొత్తగా బాధ్యతలు స్వీకరించారు. ఆయనను ఆహ్వానించేందుకు నేవీ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ వేడుకకు తల్లిదండ్రులతో కలిసి ఆయన పాల్గొన్నారు.
అయితే బాధ్యతలు స్వీకరించేముందు ఆయన చేసిన ఓ పని అందరి హృదయాలను గెలుచుకుంది. ఆయన గొప్పతనాన్ని అంతా ప్రశంసించారు. ఇంతకీ ఆయన ఏం చేశారంటే..
ఇండియన్ నేవీ కొత్త అడ్మైరల్‌గా ఆర్ హరికుమార్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. 30 ఏళ్లుగా నేవీ అడ్మైరల్‌గా బాధ్యతలు నిర్వర్తించిన అడ్మైరల్ కరణ్‌బీర్ సింగ్ పదవీ విరమణ చేయడంతో.. ఆ బాధ్యతలు హరికుమార్‌కు అప్పగించింది రక్షణశాఖ.
ఈ క్రమంలోనే ఓ ప్రత్యేక వేడుక నిర్వహించింది. ఆ వేడుకకు తల్లిదండ్రులతో కలిసి హరికుమార్ హాజరయ్యారు.
కుటుంబ సభ్యులు, తోటి సిబ్బంది, శ్రేయోభిలాషుల మధ్య ఈ వేడుక జరిగింది. అయితే అడ్మైరల్‌గా బాధ్యతలు స్వీకరించే ముందు హరికుమార్.. తన తండ్రిని కౌగలించుకుని శుభాకాంక్షలు అందుకున్నారు. పక్కనే ఉన్న తల్లిని కూడా హత్తుకున్నారు. కానీ దానికి ముందే ఆమె పాదాలు తాకి ఆశీర్వాదం తీసుకున్నారు.
తల్లిపై ఆయనకున్న ప్రేమ చూసి అందరూ ఆయనను ఎంతగానో అభినందించారు. ఈ వీడియో ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎంతోమంది నెటిజన్లు ఆయనను ప్రశంసిస్తూ పోస్ట్‌లు చేస్తున్నారు.