Corona Positive | 173 మంది ప్రయాణికులకు కరోనా.. ఎయిర్‌పోర్టులో కలకలం

Corona Positive | ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి పడగ విప్పుతోంది. అందుకే విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు..

Spread the love
Corona Positive
Corona Positive

Corona Positive | ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి పడగ విప్పుతోంది. అందుకే విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై పలు దేశాల్లో ఆంక్షలు విధిస్తున్నారు. ఇలాంటి సమయంలో భారత్‌కు వచ్చిన 173 మంది ప్రయాణికులకు కరోనా పాజిటివ్ అని తేలింది.

దీంతో అమృత్‌సర్ విమానాశ్రయంలో కలకలం రేగింది. వీళ్లందరూ ఇటలీ రాజధాని రోమ్ నుంచి భారత్‌కు వచ్చారు. అయితే తాము విమానం ఎక్కేముందు కూడా కరోనా పరీక్ష చేయించుకున్నామని, వాటిలో నెగిటివ్ ఫలితం వచ్చిందని ప్రయాణికులు చెప్తున్నారు. విమానం దిగగానే అందరికీ కరోనా ఎలా వస్తుందని నిలదీస్తున్నారు.

తమకు పరీక్షలు నిర్వహించిన ల్యాబొరేటరీ సామర్థ్యంపై ప్రశ్నలు లేవనెత్తారు. వీరిలో కొందరు ప్రయాణికులకు మళ్లీ కరోనా పరీక్షలు నిర్వహించగా.. నెగిటివ్ ఫలితం వచ్చింది.

దీంతో తొలిసారి కరోనా పరీక్షలు చేసిన ల్యాబొరేటరీపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణికులపై భారత ప్రభుత్వం పలు ఆంక్షలువ విధించిన సంగతి తెలిసిందే.

విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు కచ్చితంగా వారం రోజులపాటు క్వారంటైన్‌లో ఉండాలనేది వీటిలో ప్రధానమైన నిబంధన. అదే దేశంలోకి వచ్చాక కరోనా పాజిటివ్ అని తేలితే మరిన్ని కఠినమైన ఆంక్షలను ఫాలో అవ్వాల్సి ఉంటుంది.
#Coronavirus #TravelRestrictions #Punjab

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *