

viral | విచిత్రానికే విచిత్రం ఈ జంట. ఈ జంటలో అబ్బాయి పేరు గ్జీ టియాన్‌రాంగ్. హాంకాంగ్‌లో ఉంటాడు. ఈ మధ్యనే గ్జీ ఓ అమ్మాయితో గ్రాండ్‌గా నిశ్చితార్థం చేసుకున్నాడు.
కానీ ఈ విషయం తెలిసిన వాళ్లంతా షాక్ తిన్నారు. ఎందుకో తెలుసా..? గ్జీ డేటింగ్ చేస్తోంది ఓ అమ్మాయితో కాదు.. అమ్మాయి బొమ్మతో. అవును.. ఆ బొమ్మ ఓ సెక్స్ డాల్. ఆ బొమ్మకు మోచీ అని పేరు పెట్టుకున్నాడు గ్జీ. మోచీ ఎంతోమంచిదని, తనతో ఉంటే ఎంతో ఆనందంగా ఉంటుందని చెబుతాడు గ్జీ.
అంతేకాదు మోచీని తాను ఎప్పుడూ ముద్దు కూడా పెట్టుకోలేదని, ఆమెను ఎంతో అపురూపంగా చూసుకుంటానని చెబుతున్నాడు. అదేంటని అడిగితే.. అసలైన అమ్మాయిలకంటే ఈ బొమ్మతో డేటింగ్ చేయడం ఈజీ అని చెబుతాడు గ్జీ.
ఇంతకుముందు కొంతమంది అమ్మాయిలతో డేటింగ్ చేసినా.. వాళ్లతో ఏదో సమస్య వచ్చేదని, కానీ మోచీతో అలాంటి సమస్యే లేదని చెబుతాడు.
గ్జీని చూస్తుంటే పాపం అనిపిస్తుంది. అమ్మాయిలు బాగా హర్ట్ చేసుంటారు కదా.