

Real Heroes | సమస్య ఎదురైతే వెనక్కి తిరిగి పారిపోవడం కాదు. దానిని ఎదిరించు. అప్పుడు ఆ సమస్యే నీ ముందు తలవంచుతుంది. ఇదేదో మోటివేషన్ కొటేషన్ అనుకోకండి. ఫాలో అయితే కచ్చితంగా జరుగుతుంది.
నమ్మడం లేదా. అయితే మీకు జూడా జే కథ చెప్పాల్సిందే. జూడా జే సింగపూర్‌కు చెందిన వ్యక్తి. జూడా చిన్నప్పుడు మరుగుతున్న నీటిలో పడిపోయాడు. సెకండ్ డిగ్రీ కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరాడు. దాదాపు 45 రోజుల పాటు ప్రాణాల కోసం పోరాడి ఎలాగోలా కోలుకున్నాడు.
ఇలాంటి పరిస్థితి ఎవరికైనా ఎదురైతే.. కచ్చితంగా మరోసారి మండుతున్న వాటిని, వేడి వస్తువులను చూస్తేనే భయంతో వణికిపోతారు. కానీ జూడా మాత్రం అలా కాలేదు. తనను కాల్చిన నిప్పుపై గెలవాలనుకున్నాడు. ఆ పట్టుదలతోనే ఎన్నో ఏళ్లు కష్టపడి ఓ లిక్విడ్‌ని కనిపెట్టాడు. అదే ఫైర్ టర్మినేషన్ లిక్విడ్.
జుడా తయారు చేసిన లిక్విడ్.. ఎంతపెద్ద మంట అయినా క్షణాల్లో ఆర్పేస్తుంది. ఆ లిక్విడ్‌లో తడిసిన ఏ వస్తువును కూడా నిప్పు పూర్తిగా కాల్చలేదు. ముఖ్యంగా అగ్ని మండాలంటే ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్‌తో చర్య జరుపుతూ నిప్పు కణాలు వ్యాపిస్తాయి.
అయితే ఎప్పుడైతే ఈ లిక్విడ్‌ని అగ్నిలో ఉండే మాలిక్యూల్స్‌ని ఇది నాశనం చేస్తుంది. వాటిలోని మండే గుణాన్ని అణచివేస్తుంది. ఫలితంగా క్షణాల్లో నిప్పు మండే గుణాన్ని కోల్పోయి ఆరిపోతుంది.
2015లో తనకు తానే నిప్పు పెట్టుకుని ఆ లిక్విడ్‌తో క్షణాల్లో ఆర్పేశాడు. ఆ ఒక్క షో అతడి జీవితాన్ని మార్చేసింది. జుడా తనను తాను ఫైర్ టర్మినేటర్‌గా చెప్పుకుంటారు. అందుకే ఫైర్ టర్మినేటర్ ఇంటర్నేషనల్ అనే కంపెనీని కూడా ప్రారంభించారు.
ఆస్ట్రేలియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్.. ఇలా ఎన్నో దేశాల్లో ఊళ్లకు ఊళ్లు తగలబెట్టిన అగ్ని దావానలాల్ని ఆర్పిన ఘనత జుడాకే దక్కుతుంది.
ఇది మాత్రమే కాదు.. చైనా, ఇండియా, సింగపూర్, హాంకాంగ్, యూఏఈ, శ్రీలంక, మలేషియా, ఇంగ్లండ్, అమెరికా.. ఇలా ఎన్నో దేశాల్లో వేరు వేరు కంపెనీలకు సేవలందించారు
.https://youtu.be/c54yrPYSQ7k
#JudahJay #FireTerminator #FireAccident #Singapore #Malasia