Indian Army | హ్యాట్సాఫ్.. 9 బుల్లెట్లు దిగినా, కోవిడ్ కాటేసినా..!

Indian Army

Indian Army

Indian Army | ప్రపంచ దేశాల్లో ఏ సైన్యానికీ లేని ధైర్యం, తెంపరితన, తెగువ ఇండియాన్ ఆర్మీకే సొంతం. ఈ మాట ఎన్నో దేశాలు ఒప్పుకున్నాయి కూడా. దీనికి కారణం సీఆర్‌పీఎఫ్ కమాండర్ చేతన్ కుమార్ లాంటి ఆర్మీ అధికారులే.

టెర్రరిస్టులు తూటాల వర్షం కురిపించినా.. శరీరాన్ని బుల్లెట్లతో ఛిద్రం చేసినా ఆయన ఆత్మస్థైర్యం దెబ్బతినలేదు. కోలుకున్న వెంటనే తిరిగి ఆర్మీలో చేరారు. ఎవరాయన? అసలేం జరిగింది?

కశ్మీర్.. ఇదో యుద్ధభూమి. అటు ఉగ్రవాదులు, ఇటు ఆర్మీ అధికారుల మధ్య ఎప్పుడూ యుద్ధం జరుగుతూనే ఉంటుంది.

అలాగే 2017 ఫిబ్రవరీలో కూడా బందిపోరా జిల్లాలో సీఆర్పీఎఫ్ దళాలకు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ పోరాటంలోనే చేతన్ కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

ఉగ్రవాదుల కాల్పుల్లో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 9 బుల్లెట్లు శరీరంలోకి దూసుకుపోయాయి. చేతులు, కాళ్లు తూట్లు పడ్డాయి. మెదడులో కూడా బుల్లెట్లు దిగాయి. ఓ బులెట్ తగిలి కుడికన్ను చిద్రమైపోయింది.

Indian Army

వెంటనే ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆయనను పరీక్షించిన వైద్యులు బతికే ఛాన్స్ చాలా తక్కువని చెప్పారు. అయితే విజయవంతంగా శస్త్రచికిత్సలు పూర్తి కావడంతో బతికారు.

అయితే సాధారణంగా ఇంత తీవ్ర గాయాలైన తర్వాత ఎవరైనా ఆర్మీ నుంచి రిటైర్మెంట్ తీసుకోవచ్చు.

ఉన్నతాధికారులు కూడా ఆయనను రిటైర్మెంట్ తీసుకోవాలని సూచించారు. కానీ దేశంపై ఆయనకున్న ప్రేమ, దేశ రక్షణ కోసం చివరి ఊపిరి వరకు పోరాడాలన్న ఆయన ఆశయం అందుకు అంగీకరించలేదు.

గాయాల నుంచి కోలుకున్న కొద్ది రోజులకే తిరిగి కమాండర్‌గా బాధ్యతలు స్వీకరించారు.

ఆయన వీరత్వానికి మెచ్చి ఆర్మీ అధికారులంతా ఆయనను ‘చీతా(చిరుత) అని పిలుచుకుంటారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఆయనను కీర్తి చక్ర బిరుదుతో సత్కరించింది. ఏది ఏమైనా ఆయన ధైర్యానికి, ఆత్మస్థైర్యానికి నిజంగా నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

అయితే 2020లో ఆయన మళ్లీ కోవిడ్ బారిన పడ్డారు. తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన బతకడం కష్టమేనని డాక్టర్లు చేతులెత్తేశారు.

వెంటిలేటర్‌పై ఉంచిన డాక్టర్లు చికిత్స మాత్రమే చేయగలమని, ప్రాణాలకు గ్యారెంటీ లేదని తేల్చేశారు. కానీ మళ్లీ ఆయన మృత్యువును జయించారు. కోవిడ్ నుంచి కోలుకున్నారు.

#CRPF #ChetanKumarCheetah #IndianArmy #Covid #Terrorists #Kashmir

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *