
Indian army | భారత ఆర్మీ గొప్పతనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశం కోసం ప్రాణత్యాగం చేసేందుకు ప్రతి క్షణం సిద్ధంగా ఉంటారు. అంతేకాదు ఎవరైనా ప్రమాదంలో ఉంటే వాళ్ళ ప్రాణాలు కాపాడేందుకు తమ ప్రాణాలను సైతం అడ్డుపెడతారు.
తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది కాశ్మీర్ లో. పీఓకే సరిహద్దు గ్రామమైన బోనియర్ గ్రామంలో ఓ గర్భిణీకి నొప్పులు వచ్చాయి. అయితే గ్రామం మొత్తం మంచు కప్పేయడంతో రవాణా స్తంభించింది.
అయితే గర్భిణీ నొప్పులతో బాధపడుతోందని ఆర్మీకి సందేశం అందింది. దీంతో భారీగా మంచు పడుతున్నా లెక్క చేయకుండా.. చీనార్ కార్ప్స్ ఆర్మీ అధికారులు గ్రామానికి చేరుకున్నారు.
వాహనాలు వెళ్లే అవకాశం లేకపోవడంతో ఆ మహిళను మోసుకుంటూ గ్రామం నుంచి బయటకి తీసుకొచ్చారు. మంచులో ఆమె తడవకుండా ఓ మందపాటి వస్త్రం ఆమెకు కప్పి దాదాపు 6.5 కిలోమీటర్లు ఆమెని మోసుకొచ్చారు.
అక్కడి ప్రాథముక కేంద్రంలో చేర్పించారు. ప్రస్తుతం ఆ మహిళ ఆరోగ్యం బాగుందని.. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిందని ఆర్మీ అధికారులు వెల్లడించారు.
కాగా.. దీనికి సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది.
#IndianArmy #Kasmir #PregnantWoman #LOC